Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

విద్యార్హతలతోనే ప్రధానమంత్రి అవ్వాలి

 విద్యార్హతలతోనే ప్రధానమంత్రి అవ్వాలి అనుకుంటే....

అంబేద్కర్కు ఉన్న డిగ్రీలు ఉన్నవాడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు....
అంబేద్కర్ కున్న డిగ్రీలలో పావు వంతుడిగ్రీలు ఉన్నవాడు ఎవరూ లేరు...
అంబేద్కర్ కన్నా యోగ్యుడు ఆరోజు ఎవరూ లేరు... అంబేద్కర్ కన్నా గుణవంతుడు ఎవరు లేరు... అంబేద్కర్ కన్నా తత్వవేత్త ఇంకెవరూ లేరు.... అంబేద్కర్ కన్నా పోరాట యోధుడు ఇంకెవరూ లేరు... అంబేద్కర్ కన్నా వక్త ఆ రోజుల్లో ఎవరూ లేరు... అంబేద్కర్ కన్నా సామాజిక పోరాట యోధుడు ఆ రోజుల్లో ఎవరూ లేరు.... అంబేద్కర్ కన్నా దార్శనికుడు ఎవరు లేరు.... అంబేద్కర్కు మించిన విశ్లేషకుడు ఎవరు లేరు.... అంబేద్కర్ ను మించిన సామాజిక విప్లవకారుడు ఎవరూ లేరు.... అంబేద్కర్ ని మించిన ప్రజానాయకుడు ఎవరూ లేరు.... అంబేద్కర్ కన్నా శీలవంతుడు ఎవరూ లేరు.... అంబేద్కర్ కన్నా ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన శ్రామికుడు ఇంకెవరూ లేరు.... అంబేద్కర్ కన్నా నిర్వ్యసనపరులు ఎవరూ లేరు... అంబేద్కర్ కన్నా అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి శ్వశక్తి తో ఎదిగిన శ్రామికుడు ఎవరూ లేరు.... అంబేద్కర్ కన్నా మహానాయకుడు ఎవరూ లేరు..... ఆనాటి పెద్దలు అతనిని ఎందుకు ప్రధానమంత్రి చేయలేదు....ఆనాటి పెద్దలు కనీసం అతన్ని మంత్రి పదవిలో కొనసాగేలా కూడా ప్రవర్తించలేదు...చివరికి అతను నమ్మిన పార్టీలో కొనసాగ కుండా ఎందుకు ప్రవర్తించారు... నెహ్రూలోని ఏ అర్హతను చూసి ఆనాటి ఏకగ్రీవ ప్రధానమంత్రి అభ్యర్థి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాదని ప్రధానమంత్రి చేశారు? పటేల్ గారిలో లేని, నెహ్రూ గారి లో ఉన్న ఒక్క ఉత్తమ గుణం ...ఉన్నత డిగ్రీ అయిన చెప్పగలరా? లాల్ బహుదూర్ శాస్త్రి గారిని ...డిగ్రీలు పట్టాలు లేవనా అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగింపు పలికేలా చేశారా...? ఇందిరాగాంధీనీ ఏ డిగ్రీలు చూసి ప్రధానమంత్రి గా ప్రకటించారు! రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఏ డిగ్రీలు చూసి చేశారు? డిగ్రీలు చూపించమని అడిగారా? డిగ్రీలు చూశాక ప్రధానమంత్రిని చేశారా? Pv నరసింహారావు గారికి ఏ డిగ్రీలు ఈ ఫేక్ గాంధీ కుటుంబాల కన్నా తక్కువ ఉన్నాయని కనీసం అతని శవాన్ని కూడా పార్టీ కార్యాలయానికి అనుమతించలేదు ఎందుకు? ప్రణబ్ గారికి ఏ డిగ్రీలు తక్కువయాయని అతన్ని ప్రధానమంత్రిని చేయలేదు ఎందుకు? సోనియాగాంధీని ఏ యూనివర్సిటీ లో ఏ డిగ్రీలు చేసిందని.. ఏ గొప్ప పని చేసిందని. ప్రధానమంత్రిగా చేయాలను కున్నారు! నేడు రాహుల్ గాంధీ విదేశాల్లో ఏ డిగ్రీలు చదువుకున్నాడని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు! వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వారి డిగ్రీలు అర్హతలు చూపించారా....ఇప్పుడు మాత్రం మోడీ గారు ఎందుకు చూపించాలి? ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో లాలు ప్రసాద్ గారి భార్య ఏడిగ్రీ ఉందనీ ముఖ్యమంత్రిని చేశారు? వారి త్రిపురత్నం తేజస్విని యాదవ్కి ఏ డిగ్రీలు ఉన్నాయని ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నారు! మోడీ గారు తన డిగ్రీలను ఎందుకు చూపించాలి? ఈ దేశంలో అత్యంత పెద్ద డిగ్రీ "గాంధీ" ఇది ఉన్నవాడే ఆ కుటుంబం దృష్టిలో అత్యంత విద్యావంతుడు.... అటువంటి డిగ్రీలు మోడీకి ఎప్పటికీ రావు రావాలని ఎప్పటికీ ఆశపడరు.... చివరగా నేను చెప్పాలనుకున్నదేంటంటే.... "గాడిదను సింహం లాగా చూడాలనుకునేవారు.... సింహాన్ని గాడిదలా చేయాలని ప్రయత్నిస్తారు" 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 జై హింద్ 🙏🏾🙏🏾🙏🏾

Post a Comment

0 Comments