ధన త్రయోదశి
ధన త్రయోదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న జగన్మాత బంగారు అన్నపూర్ణాదేవి దర్శనం. అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్న నేపధ్యంలో లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో కాశీ క్షేత్రం సందడిగా మారింది.
బంగారు అన్నపూర్ణగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చే ఈ ఐదు రోజులూ అమ్మవారి ప్రసాదంగా ధాన్యం, రూపాయి కాయిన్ భక్తులకు ప్రసాదంగా అందజేయనున్నట్లు అన్నపూర్ణ ఆలయం మహంత్ శంకర పురి తెలిపారు.కార్యక్రమం ముగింపు రోజైన 5వ తేదీ శుక్రవారంనాడు బంగారు అన్నపూర్ణ మందిరంలో అన్నకూటం కార్యక్రమంలో భాగంగా 501 కేజీల బరువు తూగే విధంగా 56 రకాల పిండివంటలు, 108 రకాల మిఠాయిలను జగన్మాత బంగారు అన్నపూర్ణకు ప్రసాదంగా నివేదిస్తారు.
అలాగే నిత్యం వివిధ రకాల పండ్లు, కూరగాయలతో ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. అమ్మవారికి నివేదించిన పిండివంటలు, కూరగాయలు, పండ్లు ప్రసాదాలను ప్రతిరోజూ సాయంత్రం సాయంత్రం భక్తులకు పంపిణీ చేస్తారు.
శ్రీమాత్రే నమః
0 Comments