Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

చరిత్ర చెప్పిన మాధవదార

చరిత్ర చెప్పిన మాధవదార  

        విశాఖలో పురాతన కట్టడాలు కలిగివున్నాయి.  ఇందులో  రైల్వేస్టేషన్ కు సుమారు 8 కిలోమీటర్ల దూరములొ మాధవధార అనే గ్రామంలో సింహచలం దక్షిణ దిగ్బాగంలో రెండువేల సంత్సరాలు పురాతన చరిత్ర కలిగిన దేవాలయం ఒకటి.  ఇది మాధవస్వామి, వేణుగోపాలస్వామి, మల్లికార్జునస్వామి ఆలయాలు.  చరిత్రప్రసిద్ది చెందిన ఈ ఆలయాల కొండపై సంపెంగ మరియు ఫలాల తోటలతో ప్రకృతిలో లీనమై పచ్చని సువాసనలుతో గుబాళించే ఈ ప్రాంతం నిత్యం శోభిల్లుతుంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఎక్కడనుoచో వచ్చేనీటిధార.  దీని శిఖరాగ్రం ఎక్కడో తెలియదు ఆయినా 365 రోజులు ఏకదాటిగా ప్రవహించడం దీనిప్రత్యేకం. 

              మాధవస్వామి ఆలయానికి వేళ్ళేదారిలో గల కొండపై నుండి చూస్తె విశాఖనగర అందాలు కనువిందు చేస్తాయి.  ఎటువంటి క్షామ పరిస్తిల్లోను ఎండి పోవడo ఆంటే  ఏమిటో తెలియని ఊటజలాలు ఇక్కడ ఉన్నాయి.  

             మాధవస్వామి ఆలయం  నుంచి సింహాచలం క్షేత్రానికి మెట్ల మార్గం ఉంది. చాల శతాబ్దాల క్రితం నాటి ఈ మార్గం చాలావరకు మూసుకుపోయింది.  మెట్లు చాలాచోట్ల శిధిలమయ్యాయి.

           మాధవస్వామి, వేణుగోపాలస్వామి, మల్లికార్జునస్వామి దేవాలయాలను విజయనగారాధీశులు నిర్మించారని స్థానికులు చెబుతారు.  వీటిలో  మాధవస్వామి ఆలయం అతి పురాతనమైంది. కి.శ. 350-898 లలో  పాలించిన పల్లవుల నిర్మాణశైలి కనిపిస్తుంది. ఇందుకు నమ్మతగిన ఆధారాలు కుడా ఉన్నాయి.

         మాధవస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల మధ్యలో శాతవాహనుల కాలమునాటి(క్రీ .పూ 200 నుంచి 218 వరకు) బౌద్ద నిర్మణాలున్నయి.  ఇటుకలతో నిర్మించిన  బౌద్ద బిక్షువుల ధ్యాన గదులున్నాయి.     57  సెం.మీ  పొడవు, 11 సెం.మీ. వెడల్పు 4 సెం.మీ. మందము  కలిగిన ఇటుకలు అనేకం ఆలయం దిగువ భాగంలో  గల గోడ నిర్మాణంలో తరువాతికాలంలో  వాడారు.

         రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు మాధవాదార గ్రామాన్ని ఖాళీ చేయించి ఆలయ దిగువ ప్రాంతంలో తాత్కాలికంగా మార్చారు.  అప్పుడు నిర్మించిన గుహలో  ఈ ఇటుకలు ఎక్కువగా ఉపయగించారు.  ఈ శిధిలాలూ  నేటికీ కనిపిస్తాయి.  ఇక్కడకు దగ్గర్లో  గల అంట్లధార, పుల్లటిధార ప్రాంతాల్లో కుడా బౌద్ద శిధిలాల్లో అనేకం ఉండటం వలన ఇది ఒకప్పుడు  బౌద్ధారామంగా ఉండేదని చెప్పవచ్చు. 

     క్రీ.శ. 900 -1100 కాలంలో వైష్ట్నవ, శైవ మతాలకు, జైన, బౌద్ద మతాలకు మధ్య దాడులు జరిగినట్లు చరిత్ర చెబుతోంది.  ఆ కాలంలోనే ఇక్కడి జైన, బౌద్దారామాలు ద్వంసమై ఉండ వచ్చు అంటున్నారు.  ఆ కాలములోనే ఇక్కడ మాధవస్వామి ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చు.  

     అనకాపల్లిలోనే బోజ్జన్నకొండపై గల బౌద్ధారామాన్ని వెలికితీసిన బ్రిటిష్ పురావస్తు పరిశోధకుడు అలేగ్జండర్  రాసిన పుస్తకంలో  దారపాలెం  బౌద్దారామం  మాధవాదారకు వేనుక వైపున ఉన్న పైనాపిల్  కాలనీ దగ్గర కంబాలకొండ  ఫారేస్ట్ లో  ఉంది.  అక్కడి నుంచి  ఇక్కడికి  కొండపైకి మార్గం ఉండేదనడానికి గుర్తుగా పురాతన మెట్లమార్గం  గల లింగాల్లోవలో ఉంది.  ప్రస్తుతం మాధవదారగా పిలుస్తున్న ప్రాంతాన్ని పూర్వం మాదపాలెంగా   పిలిచేవారని తెలుస్తోంది.  చుట్టు పక్కల గల మర్రిపాలెం, బుచ్చిరాజుపాలెం, కంచరపాలెం, కరిసీపలం ( కరాసా), దారపలేం గ్రామలవలే ఈ గ్రామాన్ని కుడా మాధవపాలెం అని పిలిచేవారని  చెబుతారు.  

        ఆలయం వద్ద ఉన్న నీటిధార, మాధవస్వామి ఆలయం పేరుమీదుగా ఇది మాధవధారగా మారి ఉండవచ్చన్నది కొందరి కధనం.  వేణుగోపాలస్వామి, మల్లికార్జునస్వామి ఆలయాలు శతాబ్దాలన్నర కాలం లోపువి కావచ్చని అంటున్నారు.  ఈ ఆలయాలకు  కళింగ, తమిళ, శ్రీవైష్ణవ, బ్రహ్మణ కులాల వారు అర్చకత్వం వహిస్తుంటారు.  ఇక్కడనే డచ్చివారి కట్టడాలు సైతం ఉన్నాయి.  సీకిదారలో  రాతినుయ్యి, కొండపైన మెట్ల మార్గం మధ్యలో  ఉన్నాయి.  

      ఇక్కడ నుంచి తూర్పువైపున కొండపై బాగంలో జడ్జికోట, రాణికోటగా పిలిచే శిధిల భవనాలున్నాయి.  ఇక్కడే నీటిని నిల్వచేసే మట్టి ట్యాంకులు, కాల్చిన మట్టివరలతో గల నూతులు అనేకం వున్నాయి.  అప్పటి రోడ్డు ఇప్పటికి వుంది.  ఈ ప్రాంతం మొత్తం పురావస్తు ప్రాధాన్యత కలిగి ఉంది.  ఈ కొండ దిగువన మాధవధార గ్రామం, ఎగువ భాగాన రాజమార్గం (హైవే)ఉన్నాయి.  ఏమైనా ఇది మన వారసత్వపు చరిత్ర.  భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ ప్రాంతం గతంకన్న మెరుగైంది.  సింహాచలం దేవస్థానంవారు శ్రద్ద తీసుకుని పురాతన  బౌద్దారామం గుర్తుగా స్మారకస్తూపం ఏర్పాటు చేయించి గత చరిత్రను తెలియజేయాలి.

           మిత్రుడు జయంతి చంద్రశేఖర్ ఉత్తరాంధ్ర ప్రాచీన విషయాలు, వ్యక్తులు మీద పరిశోధించి, సేకరించి రాస్తారు

Post a Comment

0 Comments