Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

Walking Experiment on Diabetes

 


Walking Experiment on Diabetes ఫలితాలు

ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇది తెలుసుకోవాల్సింది  ఇంగ్లాండు లో జరిపిన ఒక పరిశోధన నిర్వహించగ 

రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ , సాయంత్రం కానీ , వారి వారి వీలును బట్టి  ఏకబిగిన నడిచే వారికంటే, పొద్దున్న  5 నుంచి 10 నిముషాలు,  మధ్యాహ్నం  లంచ్ తరువాత 10 నిముషాలు, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలు, అలా రోజు  మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది ! 

అలా తిన్న  5 నిముషాల లోపు లేచి , 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ! 

కాబట్టి, Diabetics  వరకు , ఎంత సేపు వాకింగ్ చేశారు , ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే , టైమింగ్ , అనగా ఎప్పుడు నడిచారు ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది ! 

ఈ పరిశోధన ,  ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు . ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా 12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు  వాలంటీర్స్ గా సహకరించారు .  ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది . వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు .

ఇందులో సగం  మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవ మన్నారు . మిగతా సగం మందిని 3 పూటలా , తిన్న వెంటనే ( తిన్న 5 నిముషాల లోపే , లేచి ) 10 నిముషాలు నడవమన్నారు . 40 రోజుల తరువాత 2 గ్రూపు లకీ Blood Test లు చేశారు 

దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యం గా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయింది . 

Sugar ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు సుమారుగా   వాకింగ్ చెయ్య వలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది . 

Action point : 

తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.  లేచి, మీ ఇంటి గదుల్లోనైనా   సరే , గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి .

  3 పూటలా నడవండి . 40 రోజుల తరువాత  blood test చేయించుకోండి.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే 

Post a Comment

0 Comments