Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శంకరభట్టు, ధర్మగుప్తుల వారు బైరాగి నుండి కాలనాగు యొక్క మణిని స్వీకరించి, పీఠికాపురము దిశగా తమ ప్రయాణము కొన సాగించుచుండిరి. వీరిద్దరికీ ఎంత తొందరగా పీఠికాపురమును చేరవలెనా అనే ఆతృత ఎక్కువ అవ్వసాగెను.ఇద్దరూ మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యం స్వీకరించిరి. ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్రశాస్త్రి. అతడు మంత్ర శాస్త్రమును తెలిసినవాడు.

వారి ఇంట ఎన్నియో నాగుపాములు తిరుగుచుండెను. కానీ అవి ఎవరికి హాని చేయవు. నాగుపాములను వారు కన్నబిడ్డలు వలె చూచుకొందురు. అవి వారి దేహములపై యదేచ్చగా తిరుగుచుండును.

దివ్యనాగులకు మణి ఉండును. అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేసెను. అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థము పొందదలచి నాగదేవతను ప్రార్ధించెను.నాగేంద్రశాస్త్రి: నాయనలారా! నేడు ఎంతయో సుదినము. నేను శ్రీపాదుల వారు 15 సంవత్సరముల బాలుడుగా ఉండునప్పుడు శ్రీపీఠికాపురమును పోయితిని. 

పాదగయా క్షేత్రమును దర్శించితిని. స్వయంభూదత్తుని మెడలో కాలనాగును ఒకదానిని చూచితిని. దానిపై మణి ఉండెను. కాలమును శాసించెడు నాగులకు కాలనాగులు అని పేరు. వాటికి ఖచ్చితముగా మణి ఉండును. ఆ మణి రాత్రి పూట దివ్యకాంతిని ప్రసరింప చేయుచుండును. వాటికి కుండలినీ శక్తి ఉండును. అవి మహర్షుల వలె నిరంతరమూ యోగ ధ్యానమున ఉండుట కద్దు. 

మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకముల స్థితులు ఉండును. కాలనాగులు సాధారణముగా మనుష్యులకు కానరావు. కాలనాగుల ఫణము మీద ఉండు నాగమణికి అంగారకగ్రహము నుండి వచ్చు అశుభస్పందనలను నివారింపచేయు శక్తి ఉండును. ఆయా అశుభస్పందనలు నాగమణి యందు లయమైపోయి దాని నుండి శుభప్రద స్పందనలు వెలువడుచుండును.

ఆ మంగళమయ స్పందనలు మంగళగ్రహ పీడితులకు శుభములను ప్రసాదింప చేయగలుగును.జాతకములో మంగళగ్రహము సరిగా లేనియెడల జీవితములో పోరాటనకర పరిస్థితులు ఉండును. 

గృహము నందలి వారితో విరోధము, బంధుమిత్రాదులతో విరోధము, ఋణబాధ, కన్యలకు యుక్తవయస్సులో వివాహము కాకపోవుటయే కాక వృద్ధకన్యలుగా మిగిలిపోయెడి పరిస్థితి, వివాహము అయిననూ సంతానము లేకపోవుట, ఏ పని ప్రారంభించిననూ, ఎంత సామర్ధ్యము ఉన్ననూ అక్కరకు రాకపోవుట మున్నగునవి జరుగుచుండును.

స్వయంభూదత్తుని దర్శించిన అనంతరము నాలో కాలనాగు యొక్క మణిని సంపాదించి తీరవలెను అనెడి ఆకాంక్ష తీవ్రమవసాగెను. ఆ మణిని నేను పొందిన యెడల జీవితము లోని అన్ని స్థాయిలలోనూ విశేషమైన పురోవృద్ధిని పొందగలిగెదనని ఆశ మిక్కుటము అవసాగెను.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments