మనం ఎవ్వరం అయినా సరే, ఈ ప్రపంచం మనల్ని నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం!
విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.ఫెయిర్ అండ్ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు!
ఈ క్షణం మాత్రమే నీది,
మరుక్షణం ఏవరిదో
ఏమవుతుందో ఎవరికి తెలుసు
ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే
అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా
నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో
పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు!
ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.
ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు.
ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్లక తప్పదు...!
చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం కూడా మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే.
కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైన వాటిని జప ధ్యానములతో ఛేధిద్దాం. అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం!
అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవ తాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం, అందులోని సంశయాలను తీర్చుకుందాం.
దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.
భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.
ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం!
నిరంతరం భగవత్ ధ్యానంతోఉంటూ, సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవిద్దాం!
శుభ కృతు నామ సంవత్సర శుభాకాంక్షలతో
పార్వతీపరమేశ్వరుల ఆశిస్సులతో
latest news, employment news , govt orders, political comments, talent in all, movie clipping (Telegu and English) latest medical and market news, facts of culture, stock market, history of events tourism
0 Comments