ఆచారాలు అలవాట్లు (సేకరణ)
ఇలాంటి వారు ఎప్పుడైనా తారసపడితే వారిని అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం, స్ఫూర్తిగా మనం కూడా ఆచరించేందుకు ప్రయత్నిద్దాం, హేళన చేసేవారికి బుద్ధి చెబుదాం ...
తలకు శిఖ ...నుదుటిన తిరు నామాలు, త్రిపుండ్రాలు, విభూతి పట్టలు, తిలక ధారణ ...చెవులకు పొగలు .మెడలో రుద్రాక్ష మాలలు, తులసి మాలలు, స్పటిక మాలలు ...ఉత్తరీయం పంచ కట్టు పావు కోళ్ళు ( చెక్క పాదుకలు ) ...వంటివి ధరించి, ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా ( సిగ్గు పడవలసిన అవసరమే లేదు) మన సంస్కృతి సాంప్రదాయాలను హుందాగా చాటి చెప్పేవారు చాలా అరుదు ...
ఒక్కసారి ఆలోచించండి ఒక ముస్లిం తలపై టోపీ పెట్టుకోవడానికి సిగ్గు పడడు, గడ్డం పెంచు కోవడానికి సిగ్గు పడడు, రోజూ నమాజు చేయడానికి విసుగు చెందడు, మసీదుకు వెళ్ళడం నిర్లక్ష్యం చేయడు ... అలానే ఒక క్రిష్టియన్ మెడలో శిలువ వేసుకోవడానికి సిగ్గు పడడు, చర్చ్ కి వెళ్లడం నిర్లక్ష్యం చేయడు ... ఇక్కడ కేవలం వారి నియమ నిబద్ధతల గురించి ఉదహరించడానికి వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నాను ... మరి ఎంత మంది గుళ్ళకు వెళుతున్నాం, బొట్టు పెట్టుకోవడానికి వెనుకాడుతున్నాం ... ఇది వ్రాస్తుంటే ఒక ప్రవచనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక విషయం జ్ఞప్తికొస్తోంది అది ఏంటంటే ...
ఇటువంటివి చిన్నతనం నుండీ పిల్లలకు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే ... ముందుగా వారు పాటించడం మొదలు పెడితే పిల్లలు అనుకరిస్తారు ... ఇవేవీ చిన్నతనం కాదు, మన ఆచార వ్యవహారాలు పాటించడానికి నామోషీ ఎందుకు ...
ఒకసారి నడిచే దేవుడు పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి వారు వెళుతుండగా రోడ్డు పై ఒక విగ్రహం కనిపిస్తే ఆగి చూసారట ... ఆ విగ్రహం ఒక వ్యక్తిది, తాను ఒక చేతిలో పుస్తకం పట్టుకుని, మరో చేతిని పైకెత్తి ఏదో సందేశం ఇస్తున్నట్లుగా ఉందట ... వెంటనే పరమాచార్య స్వామివారు తోటి వారితో అన్నారట, ఈ విగ్రహం నాకు నా కర్తవ్యాన్ని తెలియజేస్తోంది, సనాతన ధర్మ వైభవాన్ని భారత దేశ నలుచరుగుల పాదయాత్ర చేసి ప్రకాశింపజేసిన ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని అధిరోహించిన నేను, ఆయన చెప్పిన వాటిని ఇంకెంత జాగురూకతతో ఆచరిస్తూ, అందరినీ ఆచరించే మార్గంలో నడిపించాలో కదా అని ...
కనుక మన భావితరాలకు మన పూర్వీకులు ఆచరించి చూపిన సంస్కృతి సంప్రదాయాలను అందించవలసిన కర్తవ్యం మనదే ... సాయి సంకల్ప్ ...
సర్వేజనా సుజనోభవంతు
సర్వే సుజనా సుఖినోభవంతు ...
0 Comments