శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదులవారి మరియు హనుమంతులవారి మధ్య నేపాళ దేశము నందు జరుగుచున్న సంవాదము గురించి భాస్కర పండితుల వారు తెలియజేస్తూ ఉన్నారు.
శ్రీపాదుల వారు: నాయనా! హనుమా! నీవు కడంగడు బుద్ధిమంతుడవు.ఏ శక్తి ప్రాభవములు నా యందు కలిగి ఉండునో అవి అన్నియూ నీ యందు కూడా నెలకొని ఉండును గాక!నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలము నందలి కదళీ వనములో గుప్తంగా 300 సంవత్సరములు యోగ సమాధిలో ఉండెదను.
అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనెడి పేరుతో విఖ్యాతడనయ్యెదను. నేను శరీరమును వదిలేడి సమయము ఆసన్నమైనప్పుడు, సాయీ రూపమున ఉన్న నీ లోనికి అవతరించెదను. సుస్పష్టం గా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను.నీవు నా యొక్క సర్వ సమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు.
హనుమ: ప్రభూ! దేహాబుద్దితో మీ సేవకుడను కావున అల్లామాలిక్ అని సంచరించెదను.కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా! మీకును, నాకును అంతరము ఉండుట భావ్యమా? నేను మీరుగా, మీరే నేనుగా మారిన యెడల కదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్తసాయుజ్యం ప్రసాదింపుడు.
శ్రీపాద శ్రీవల్లభులు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావలసినదిగా శాసించిరి. కాలపురుషుడు చేతులు కట్టుకొని నిలబడిఉండెను. అంతట, శ్రీపాద శ్రీవల్లభులు: కాలపురుషా! ఈ హనుమ, కాలపురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడు అయ్యెను. ఇతనికి నా సాయుజ్యమును ప్రసాదించదలచితిని. ఇతనికి నాధ శబ్దమును కూడా ఇచ్చు చుంటిని. ఇకనుండి ఈతడు సాయినాథుడు అని పిలువబడును గాక! నేడు దత్తజయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణంగా మార్చి, దత్తస్వరూపము చేయవలసినది. అని ఆజ్ఞాపించారు.
మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

.jpeg)

0 Comments