శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శంకరభట్టు, ధర్మగుప్తుల వారు, భాస్కర పండితుల వారి వద్ద మంత్రాక్షతలు తీసుకొని వారి ప్రయాణం కొనసాగిస్తూఉన్నారు.
వీరిద్దరూ కొంతదూరము ఎడ్లబండిపై ప్రయాణము చేసిరి. ఆ ఎడ్లబండి ఒక పెళ్లివారిది. ఆపై వైశ్యప్రముఖుల గుఱ్ఱపుబండిపై ప్రయాణము చేసిరి. ఆ వైశ్యులు కొండవీడునకు వెళ్ళుచుండిరి. గుఱ్ఱపు బండిలో ఒక వైశ్య ప్రముఖుడు: నాయనలారా! నేడు మాకెంతో శుభదినము.మీరు ఎడ్లబండిపై ప్రయాణము చేయుచున్న పెండ్లివారికి, శ్రీపాదుల వారి మంత్రాక్షతలు ఇచ్చిరి. ఆ తదుపరి మాకు ఇచ్చినారు.
నేను ఎప్పుడో ఒక పర్యాయము పీఠికాపురమునకు వ్యాపారము చేయు నిమిత్తము పోయి ఉంటిని. అంతట, శ్రీపాదుల వారి దర్శనము పైండా వెంకటప్పయ్య శ్రేష్టి గారి ఇంట జరిగినది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో, నీ కుమారుని వివాహసందర్భమున నేను నా ఆశీస్సులుతో మంత్రాక్షతలను ఇచ్చెదను.
నీకు ఎవరి ద్వారా అయితే మంత్రాక్షతలు అందజేయబడునో ఆ బీద బ్రాహ్మణునకు 11 వరహాలు దక్షిణగా నిమ్ము.అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును. అతని కుమారునకు నీ కుమార్తె నిచ్చి, వివాహము చేసెదనని వాగ్దానము చేసి, నూరు వరహాలు ఇచ్చి, కొండవీడు నందు నిశ్చయతాంబూలములను జరిపించుకొనుము.
మిగిలిన చరితామృతం రేపు తెలుసుకుందాము.

.jpeg)

0 Comments