Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

 


1502. V 2-7. 270423-7.

*ఎందరి త్యాగఫలమో …**మనం హ్యాపీగా వున్నామంటే..!!* *డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు*

*ఎందరో మహానుభావులు.. అందులో ఒక మహానుభావుని చరిత్ర......!*
చదువంటే ఇష్టం లేదు..బడికి పోవడం అంతకన్నా ఇష్టం లేదు అల్లరిచిల్లరగా తిరగడం ఆటపాటలతో కాలక్షేపం చేయడం ఆ పిల్లాడి రోజువారీ దినచర్య!బంధువులందరూ అతనికి చదువు రాదని, అతనొక తెలివి తక్కువవాడని, ఏదైనా పనిలో చేర్చేయమని వాళ్ళమ్మకు సలహాలిచ్చేవారు. టీచర్స్ సహితం అతనికి చదువురాదని తేల్చేశారు. ఎందరు చెప్పినా తన కొడుకు మీద ఆ తల్లికి ఎనలేని నమ్మకం. అతనిని చదివిస్తే, గొప్పవాడవుతాడని ఆ తల్లి నమ్మకమే ఈ ప్రపంచానికి ఒక గొప్ప పరిశోధకుడు, డాక్టర్ ను అందించింది.

ఎంత అల్లరిపెట్టినా అతనిని బడికి పంపడం ఆపలేదామె. ప్రాధమిక విద్యకాగానే మాధ్యమిక విద్యకు రాజమండ్రికి పంపింది. వాళ్ళదేమీ ధనికకుటుంబంకాదు. చాలా పేద కుటుంబం. వారి నాన్న ఒక బట్టల దుకాణంలో చిన్న గుమస్తా. చాలీచాలని జీతం. ఆ కుర్రాడు మెట్రిక్యూలేషన్ తప్పాడు. వాళ్ళ నాన్న జాబ్ నుండి రిటైర్ అయ్యారు. అందరూ పనిలో చేరమన్నారు. కానీ వాళ్ళమ్మకు ఇంకా కొడుకు మీద నమ్మకం. అతను అక్కడ చదవడని మద్రాసు పంపించి చదివించాలని తలచింది.
తన బంధువులలో ఒకాయనకు తన "పుస్తెలు" ఇస్తూ వాటిని అమ్మి డబ్బులు తీసుకొని రమ్మని, పిల్లాడిని మద్రాసు చదువుకు పంపాలనీ చెబుతూ తన మెడలోని పుస్తెలు తీసి ఆయన చేతిలో పెట్టింది.
ఇది అనుకోకుండా చాటునే వున్న ఆ అబ్బాయి చూసాడు. అంతే! అతని చెంప చెళ్ళుమని పించింది. అమ్మ తపన చూసి మారుమాటలాడకుండా మద్రాసు చేరి, హిందూకాలేజ్ లో మెట్రిక్ చేరిపోయాడు.
ఇంతలో నాన్న చనిపోయాడు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోసాగింది. పేదరికం బాధిస్తుంది. మనసు చదువు మీద లగ్నం కావడంలేదు. కానీ అమ్మ అమ్మిన పుస్థిలే కనబడు తున్నాయి.
ఇంతలో గాంధీజీ స్వాతంత్రోద్యమ పిలుపు.. ఆవేశంతో ఖద్దరు ధరించి నినాదాలు చేస్తూ కాలేజ్ కు వెళ్ళినందుకు యాజమాన్యం చర్యలు తీసుకొంది. కొన్నిరోజులు ఆలోచించిన తర్వాత సన్యాసం తీసుకుంటే మంచిదనిపించింది. మెట్రిక్ మళ్ళీ తప్పాడు. నిరాశానిసృహలు… అమ్మ కోరిక కల్లగా మిగిలిపోతుందేమో!
అప్పుడే అక్కడ ఆచార్యునిగా పని చేస్తున్న ‘చిలకమర్తి లక్ష్మీనరసింహం అతనికి కర్తవ్యబోధ చేసి, మళ్ళీ మెట్రక్ చదివేందుకు ఫీజు కట్టారు. ఈసారి పట్టుదలతో చదివాడు. ఫలితంగా మెట్రికలేషన్ ‘డిష్టంక్షన్’ లో పాసైనాడు.
ఫలితంగా మద్రాసు మెడికల్ కాలేజ్ లో మెడికల్ సీటు వచ్చింది. LIM లో డిప్లమా చేసాడు. రామకృష్ణ మఠంలో సేవలు చేస్తూ సన్యాసిగా జీవనం సాగించాలని అనుకున్నాడు. అందరూ వారించారు. డాక్టర్ గానే ఎక్కువమందికి సేవచేయవచ్చని సముదాయించారు. ఇంతలో పెద్ద దుర్వార్త వినాల్సివచ్చింది. తన పెద్దన్నయ్య ‘పురుషోత్తం’ స్ఫ్రూ వ్యాధితో మరణించాడని. ఆ షాక్ నుండి తేరుకునే లోగా మరో వారంలోపల చిన్న అన్నయ్య కృష్ణమూర్తి అతిసారతో మరణించారు. ఈ వ్యాధిని ‘ఉష్ణమండల స్ఫ్రూ వ్యాధి’ అంటారు. ఇది వస్తే రక్తహీనతతో చనిపోయేవారు. దానికి మందులేదప్పటికి. 1925లో ఇతనికీ అదే వ్యాధి వచ్చింది. అయితే అప్పటి పేరున్న ‘ఆయుర్వేదిక్ డాక్టర్ ‘ఆచండ లక్ష్మీపతి’ దాని నుండి ఇతనిని కాపాడాడు.
ఎలాగైనా ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిశ్చయించున్నాడా యువకుడు.
దాతల సహకారంతో అమెరికా పయనమయినాడు. అక్కడ ‘హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్’ నుండి మెడిసన్ పట్టా అందుకున్నాడు. అక్కడే ఆచార్యునిగా చేరేందుకు ప్రయత్నించగా వర్ణవివక్ష కారణంగా ఆ పదవి రాలేదు. బ్రతకడానికి చాలా బాధలు పడ్దాడు. చివరికి ‘లేడర్లీ పరిశోధనా సంస్థ’లో చేరాడు. అక్కడా అతనికి అవమానాలే. ఆయనపట్ల చిన్న చూపు, అసూయ.*

అయినా పట్టువదలకుండా తన పరిశోధనలో లీనమయినాడు. ‘హెట్రాజన్’ అనే మందును కనిపెట్టాడు. ఇది ‘బోధకాలు నివారణకు పనిచేస్తుంది. తర్వాత ‘అరియోజన్’ అనే మందును కనిపెట్టాడు. ఇదే టెట్రాసైక్లిన్’ గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘యాంటీబయాటిక్ మెడిసిన్.
ఈయన టైపాయిడ్ కి, పాండురోగానికి, టిబీకి, మందులు కనిపెట్టారు. అలాగే క్యాన్సర్ నిరోధక మందులను కూడా కనిపెట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన అన్నలు ఏ వ్యాధి వల్ల చనిపోయారో… ఆ వ్యాధికి విరుగుడైన "ఫోలిక్ యాసిడ్" కనుగొన్నాడు. దీని వలన లక్షలాదిమందిని "రక్తహీనత" నుండి కాపాడగలిగారు. దాదాపు 100 దాకా పరిశోధనావిష్కరణలకు కారణమైనాడు. ఈ ప్రయోగాలలో పడి తన భార్య చనిపోయినా చూసేందుకు రాలేకపోయారు. ఇతని సేవలకు మెచ్చి 1947 లో ‘అమెరికా పౌరసత్వం’ వచ్చినా ఆయన తీసుకోలేదు. భారతీయుడిగానే ఉంటానన్నారు.

1945 లో ఈయన, సహచరుడు ‘బెంజిమన్ డుగ్లర్’ కలిసి ‘ఫోలిక్ యాసిడ్’ కనుగొనినందుకు నోబుల్ ఫ్రెజ్ అందుకున్నాడు.
1948 ఆగష్టు తొమ్మిదిన ‘కరోనరీ త్రాంబసిస్’ అనే వ్యాధితో ఆయన మరణించారు. ఈయన పేరేమిటో తెలుసా? యల్లాప్రగడ సుబ్బారావుగారు! భీమవరం నివాసి. వైద్యశాస్త్రంలో ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించినవారు. ఆయనకు గుర్తుగా ఇటీవల కొత్తగా కనుగొన్న ఫంగస్ కు ఆయన పేరు పెట్టారు.
ఈ రోజుకీ అమెరికాలోని ‘లెడర్లీ పరిశోధనా కార్యాలయం ‘ముందు ఆయన ‘విగ్రహం’ వుంది. దాని క్రింద ‘యల్లాప్రగడ సుబ్బారావు’.. 1895-1948. పరిశోధకుడు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు.. ‘లెడర్లీ పరిశోధనాసంస్థ డైరెక్టర్’ అని రాసివుంటుంది.
వర్ణవివక్ష కారణంగా ఈయన ఆవిష్కరణ ఇంకా కొన్ని వెలుగులోనికి రాకుండా తొక్కిపెట్టారనే వాదన కలదు
డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిలో ఈయన కూడా ఒకరు!
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
ఇలాటి మంచి విషయాలకోసం…*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...944065 2774. లింక్ పంపుతాము


Post a Comment

0 Comments