సేకరణ
రోడ్డు వైడనింగ్ లో చినవాల్తేర్ CGHS బిల్డింగ్ కోత / కూల్చివేత.
నేడు అనగా తేది.28-7-2023న చినవాల్తేర్ CGHS బిల్డింగ్ ను GVMC వారు పాక్షికంగా కూల్చివేశారు. 12 అడుగుల మేరకు వైడనింగ్ చేయవలసివుండగా, బుల్డోజర్ తో తొలగించడం వలన అస్తవ్యస్తంగా కూల్చివేయబడింది. మొత్తం కరెంట్ సరఫరా నిలిపివేశారు. మెడికల్ స్టోర్ లో లక్షలాది రూపాయల మందులు నిల్వ ఉన్నాయి. వాటికి రక్షణ కొరవడింది. నేడు, రేపు శెలవు కాని, సోమవారం నుండి రోగులను చూసే పరిస్థితి లేదు. చినవాల్తేర్ వెల్నెస్ సెంటర్ మూసివేయడం వలన నిన్న ఒక్క రోజే డాబా గార్డెన్స్ సెంటర్ లో రద్దీ పెరిగి పెన్షనర్సు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు.
రోడ్డు వైడనింగ్ జరుగుతుందని చాలా కాలంనుండి తెలుసు. ఇదే విషయాన్ని తేది.24-6-2023 న Additional Director చినవాల్తేర్ వెల్నెస్ సెంటర్ మీటింగ్ లో చెప్పారు. కానీ చర్యలు శూన్యం. నెలకు సుమారు రూ.65,000/- అద్దె తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, బిల్డింగ్ కేర్ టేకర్ మెంటల్ హాస్పిటల్ యాజమాన్యంకు బాధ్యత లేదా? GVMC మరియు Health Department రెండూ రాష్ట్ర ప్రభుత్వ రంగలే. సమన్వయం చేసుకుని సక్రమమైన పద్ధతిలో (ముందుగా గోడ నిర్మాణం చేసి) తొలగింపు చర్యలు ఎందుకు చేపట్టలేదు? హైదరాబాద్ లో ఉన్న CGHS Additional Director కు విశాఖపట్నం వెల్నెస్ సెంటర్ పై ఉన్న పర్యవేక్షణ ఇదేనా?
చివరికి నష్టపోయేది, యిబ్బందులు పడేది పెన్షనర్లు, రోగులే. ఇప్పటికే అరకొరగా ఉన్న CGHS సౌకర్యం ఇప్పుడు మరింత కష్టాల్లోకి నెట్టింది. అందుకే CGHS Additional Director ఆఫీస్ విశాఖపట్నం లో ఉండాలని మనం మొదటినుంచీ అడుగుతున్నది. విశాఖపట్నం CGHS పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని కోరుతూ..
- కార్యవర్గం తరుపున, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి, ACGEPA, Visakhapatnam.


.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments