కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ లేదా సర్వీస్ మధ్యలో చనిపోయేనినపుడు బెనిఫిట్స్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ లేదా సర్వీస్ మధ్యలో చనిపోయేనినపుడు ఆ ఉద్యోగికి ఏ బెనిఫిట్స్ వస్తాయో ఎంత సమయం లోపు అవి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఒక్క సారి తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం.
ఉద్యోగి రిటైర్ అయితే సాధారణంగా అతనికి వచ్చేవి
(2).పెన్షన్
(3).రిటైర్మెంట్ గ్రాటుఇటీ(GRATUITY)
(4).లీవ్ ఎంకేశ్మెంట్
(5).ఫిక్సడ్ మెడికల్ అల్లోవెన్సు(CGHS పరిధిలో లేకపోతే)
ఒక వేళ సర్వీస్ మధ్యలో చనిపోతే ఉద్యోగి కుటుంబానికి వచ్చేవి
(2).ఫ్యామిలీ పెన్షన్
(3).డెత్ గ్రాట్యువిటీ
(4).లీవ్ ఎంకేషమెంట్
(5).ఫిక్సడ్ మెడికల్ అల్లోవెన్సు(CGHS పరిధిలో లేకపోతే)
2004 జనవరి 1 తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులకు కూడా CGEGIS,రిటైర్మెంట్ గ్రాట్యువిటీ, డెత్ గ్రాట్యువిటీ, ఫ్యామిలీ పెన్షన్ ,లీవ్ ఎంకేశ్మెంట్ ,ఫిక్సడ్ మెడికల్ అల్లోవెన్సు ఉన్నావి .అట్లాగే PRAN టైర్ 1 అకౌంట్లో 60% తీసుకోవచ్చు. మిగిలిన 40% తో ANNUITY స్కీంలో ఇన్వెస్ట్ చేయాలి. NPS గురెంచి ఇదివరకే మీకు చెప్పడం జరిగింది.అట్లాగే cgegis గురుంచి కూడా చెప్పడం జరిగింది.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు.
- ఉద్యోగి సర్వీస్ బుక్ లో పేర్కొన్న తన పుట్టిన తేదీ ఆధారంగా ఆ నెల చివరి రోజున మధ్యాహ్నం రిటైర్ అవ్వవలెను.
- ఒకవేళ ఉద్యోగి 1వ తేదీన పుడితే అతను అంతకు ముందు నెల చివరి రోజున మధ్యాహ్నం రిటైర్ అవ్వవలెను
- ఒకవేళ నెల చివరి రోజు సెలవు దినం అయితే ముందు రోజు మధ్యాహ్నం రిటైర్ అవ్వవలెను.
(1).పెన్షన్:-
- పెన్షన్, గ్రాట్యువిటీ కి సంబంధించిన రూల్స్ అండ్ రేగులాషన్స్ అన్ని కూడా CENTRAL CIVIL SERVICES (PENSION RULES)1972 లో రూల్ NO 1 నుండి 89 వరకు పొందుపరచబడినవి.
- ప్రతీ ఉద్యోగి తను చేసిన సర్వీస్కు ఒక్క పెన్షన్ మాత్రమే పొందుతాడు
- ఒకవేళ ఉద్యోగి రిటైర్ అయిన తరువాత మళ్ళీ అతని సేవలు ప్రభుత్వానికి అందించినా (REEMPLOYMENT) ఆ కాలానికి ఎటువంటి పెన్షన్, గ్రాట్యువిటీ ఉండవు.
- CCS పెన్షన్ రూల్స్ 1972 లో రూల్ NO 8 ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగి మంచి నడవడికతో ఉండాలి. ఒకవేళ సదరు ఉద్యోగి క్రిమినల్ కేసులలొ చిక్కుకున్న లేక నడవడిక బాగోలేకపోతే సదరు ఉద్యోగి పెన్షన్ని పూర్తిగా లేక కొంత కాలం నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
- రిటైర్ అయిన గ్రూప్ A అధికారి ఎటువంటి వాణిజ్యా సంస్థలో సంవత్సరం వరకు ప్రభుత్వం అనుమతి లేకుండా చేరకూడదు.ఒక వేళ చేరితే అతని పెన్షన్ నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
- పెన్షన్కి అర్హత పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు regular సర్వీస్ అవసరం
- 01-01-2016 నుండి కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు 9000 రూపాయిలు మినిమం పెన్షన్ గా, 1,25,000 రూపాయిలు గరిష్ఠ పెన్షన్ గా ఉంది.
- ప్రతీ 6 నెలలకు (జనవరి1,జులై1) హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 24 నెలలు నుండి 30 నెలల్లో రిటైర్ కాబోవు ఉద్యోగుల వివరాలను అకౌంట్ ఆఫీస్ కి పంపిస్తారు.
- హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సంవత్సరం ముందు నుండి సదరు ఉద్యోగి సర్వీస్ ని లెక్కేంచి ఫారం 7 ని పూర్తిచేస్తారు.
- అట్లాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్ కాబోవు ఉద్యోగికి 8 నెలలు ముందు అతని మూలవేతనమ్, సర్వీస్ కి సంబంధించిన వివరాలు ఫారం5 లో పూర్తి చేసి ఉద్యోగికి పంపుతారు.అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని ఉద్యోగి రిటైర్ కావడానికి 6 నెలల లోపు వాటిని తిరిగి ఆఫీస్లో అందచేయాలి.
- హెడ్ ఆఫీస్ ఉద్యోగి రిటైర్ కావడానికి 4 నెలలు ముందుగానే ఫారం5,ఫారం7 తో పాటు ఫారం8(covering letter),సర్వీస్ బుక్, పెన్షన్ calculation sheet (3copies) PAO కి పంపుతారు.
- ఉద్యోగి రిటైర్ అవుతునప్పుడు ఉద్యోగి చివరి నెల జీతంలో 50% లేదా సరాసరి 10 నెలల (బేసిక్+da) జీతం కానీ ఏది ఎక్కువ అయితే అది పెన్షన్గా ఇస్తారు.
అట్లాగే విశ్రాంత ఉద్యోగికి
85-90 " " " 30%
90-95 " " " 40%
95-100 " " " 50%
100పైన ఉంటే. 100%
పెన్షన్ అదనంగా ఇస్తారు.ఒకవేళ పెన్షన్ పైసలులో వస్తుంటే తరువాత రూపాయిగా లెక్కకడతారు.
ఫ్యామిలీ పెన్షన్:-
ఉద్యోగి సర్వీస్ మధ్యలో చనిపోయినా లేదా రిటైర్మెంట్ తరువాత చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగి మూలవేతనంలో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు
- ఇక్కడ కుటుంబ సభ్యులు అనగా
(1).భార్య/భర్త(చనిపోయే వరకు లేదా తిరిగి 2వ పెళ్లి చేసుకునేటి వరకు ఏది ముందు వస్తే అది అప్పటివరకు ఇస్తారు)
గమనిక:భార్య/భర్త కి పిల్లలు లేకపోతే 2వ పెళ్లి చేసుకున్నా కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.
(2).కొడుకు/కూతురు(25సంవత్సరాలు వచ్చేవరకు, పెళ్లి అయ్యే వరకు,9000 కన్నా ఎక్కువ ఆదాయం సంపాదెంచి వరకు ఏది ముందు వస్తే అది అప్పటివరకు ఇస్తారు)
(3).సోదరులు, సోదరీమణులు,విడాకులు లేదా వితంతువు అయిన కూతురు(పెళ్లి అయ్యే వరకు లేదా 9000 కన్నా ఎక్కువ సంపాదిేంచే వరకు)
(4).వికలాంగుడు అయిన కొడుకు/కూతురు(9000 కన్నా ఎక్కువ సంపాదిేంచే వరకు)
(5).తల్లిదండ్రులు(చనిపోయే వరకు లేదా 9000 కన్నా ఎక్కువ సంపాదిేంచే వరకు ఏది ముందు వస్తే అది అప్పటివరకు ఇస్తారు).
- అట్లాగే ఉద్యోగి కనిపిెంచకుండా ఉంటే పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసిన 6 నెలల తరువాత నుండి ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.
- ఉద్యోగి 7 సంవత్సరాలు తక్కువ కాకుండా సర్వీస్ చేసిన తరువాత మరనిస్తే ఎక్కువ ఫ్యామిలీ పెన్షన్ (50% బేసిక్+da) వస్తుంది.
- ఈ పెన్షన్ని ఉద్యోగి చనిపోయిన 10 సంవత్సరాల వరకు ఇస్తారు తరువాత 30% normal ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు
- మరనించిన విశ్రాంత ఉద్యోగులకు 7 సంవత్సరాలు వరకు లేదా 67 సంవత్సరాలు వరకు ఏది ముందు వస్తే అది అప్పటివరకు ఇస్తారు.
- ఈ పెన్షన్ మరనించిన ఉద్యోగి తల్లిదండ్రులు లకు వర్తెంచదు.
గ్రాటుఇటీ:-
- ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి ,ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా అందజేయు ఆర్థిక సౌలభ్యంని గ్రాట్యుటి అందురు.
- రిటైర్మెంట్ గ్రాట్యుటికి కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ అవసరం
- గ్రాట్యుటిని కోర్టులు అటాచ్ చేయలేవు అట్లాగే దేనికి income tax కట్టవలసిన అవసరం లేదు
- గ్రాట్యుటి ని ఈ క్రింది ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు
【సర్వీస్×(చివరి నెలమూలవేతనమ్+da)×15】÷26
- ఇక్కడ ఉద్యోగి సర్వీస్ 9సంవత్సరాల 6 నెలలు అయితే 10 గా లెక్కిస్తారు. ఒకవేళ 9 సంవత్సరాల 5 నెలలు అయితే 9 క్రింద లెక్కిస్తారు.
- ఒకవేళ ఉద్యోగి సర్వీస్ మధ్యలో చనిపోతే అతని నామినికి death గ్రాట్యుటి ని ఇస్తారు. ఇది మరణించిన ఉద్యోగి మూలవేతనమ్, da మీద
1-5 years ---->6 రేట్లు
5-11 years ------->12 రేట్లు
11-20 years------>20 రేట్లు
20 సంవత్సరాలు తరువాత చనిపోతే ప్రతీ 6 నెలలకు ఒక నెలలో సగం చొప్పున గరిష్టంగా 33 రేట్లు ఇస్తారు.
- ప్రస్తుతం (01-01-2016 నుండి)గ్రాట్యుటి గరిష్ట పరిమితి 20 లక్షలు .da 50% పెరిగితే గ్రాట్యుటి కూడ 25% పెంచుతారు.
- నామిని ని 2 లేదా 3 ని పెట్టుకోవచ్చు. అట్లాగే వారికి ఎంత షేర్ ఇవ్వాలి అనేది ఉద్యోగి ఇష్టం.
- నామిని మైనర్ అయితే గార్డియన్ ఉండాలి. గార్డియన్ లేకుండా మైనర్ కి గరిష్టంగా 20% లేదా 1.50వేల రూపాయలు ఏది తక్కువ అయితే అది మాత్రమే ఇస్తారు.
- నామిని ఎవరిని పెట్టకపోతే ఉద్యోగి భార్య/భర్త,పెళ్లికాని కూతురు, కొడుకు, వితంతువు అయిన కూతురికి సమానంగా ఇస్తారు.
- ఒకవేళ ఉద్యోగికి ఎవరు లేకపోతే "కోర్ట్ ఆఫ్ లా" సర్టిఫికేట్ ప్రకారం గ్రాట్యుటి ఇస్తారు.
- అప్పటికి కూడా ఎవరు లేకపోతే గ్రాట్యుటి laps అవుతుంది
ముఖ్య గమనిక:-
(1).CCS (pension) rules 1972లో రూల్ నెంబర్ 68 ప్రకారం ఉద్యోగి రిటైర్ లేదా సర్వీసులో ఉండగా చనిపోయిన అతనికి రావాల్సిన గ్రాట్యుటి 3 నెలలు లోపు ఇవ్వాలి.ఒక వేళ ఇవ్వక పోతే సదరు అధికారిపై అపరాధ రుసుము క్రింద GPF వడ్డీ రేటు(ప్రస్తుతం 8%) క్రింద వడ్డీ వసూలు చేస్తారు.
(2).అట్లాగే మిగిలిన బెనిఫిట్స్ అన్నికూడా 6 నెలల్లోపు ఇవ్వాలి.
- ఉద్యోగి కముటేషన్ క్రింద ఉద్యోగి రాబోయే పెన్షన్ లో 40% ని తీసుకోవచ్చు. యీ మోతాన్ని 15 సంవత్సరాలు లోపు రికవరీ చేస్తారు.
లీవ్ ఎంకేషమెంట్:-
ఉద్యోగి తను దాచుకున్న ఆర్జిత సెలవలు(EL),HPL రెండు కలిపి గరిష్టంగా 300 రోజులు వరకు రిటైర్ అయినపుడు లేదా సర్వీస్ మధ్యలో చనిపోతే అప్పటి ఉద్యోగి జీతం ఆధారంగా CASH ఇస్తారు
【(మూలవేతనమ్+DA÷30)×EL(గరిష్టంగా 300రోజులు)】
అట్లాగే HPL కి ఫార్ములా
【(మూలవేతనమ్+DA÷30)×HPL(గరిష్టంగా 300రోజులు)】
ఫిక్సడ్ మెడికల్ అల్లోవెన్సు:-
- విశ్రాంత ఉద్యోగులు ఎవరు అయితే cghs (5కిలోమీటర్లదూరం ) పరిధి దాటి ఉన్నారో వాళ్లకు నెలకు 1000రూపాయిలు ఫిక్సడ్ మెడికల్ అలౌవెన్సు క్రింద ఇస్తున్నారు(01-07-2017 నుండి).
- ఇప్పటి వరకు మన పోస్టల్ డిస్పెన్సరీకి 2.5 కిలోమీటర్ల radius పరిధి దాటి ఉంటే ఈ అల్లోవెన్సు ఇస్తున్నారు.
There seems to be mistake in calculation of:-
1. PENSION:
2. GRATUITY:
=Last month basic pay+DAx Number of years service÷2
The Gratuity calculation shown in the above articale may be pertains to Private Sector Employees.
0 Comments