On-line appointments booking చేయు విధానము
మీ స్మార్ట్ ఫోన్ లో క్రోమ్ యాప్ ను ఉపయోగించండి
1 గూగుల్ వెబ్ లో www.cghs.nic.in. అని టైప్ చేయండి హోమ్ పేజీ వస్తుంది
2 హోమ్ పేజీ లో ఆన్ లైన్ అపాయింట్మెంట్స్ పై క్లిక్ చేయండి
3 వెరిఫికేషన్ ఫామ్ వస్తుంది
4 అపాయింట్మెంట్ కావాల్సి లబ్ది దారుని BNID నెంబర్ సూచించబడిన బాక్స్ లో ఉంచండి -- తరువాత క్యాప్ఛా (captcha) ఎంటర్ -- తరువాత వచ్చిన 0TP ఎంటర్ ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ చేయాలి
5 లబ్థి దారుని వివరాలు వచ్చే వరకు రీజనరేట్ OTP ఆప్షన్ ఉపయోగించండి OTP ఎంటర్ చేస్తూనే ఉండాలి. సర్వర్ పై ఉన్న లోడ్ కారణం గా expired OTP అని వస్తుంది ఓపిక వహించాలి
6 లబ్థి దారుని వివరాలు సరిపోయిన తదుపరి proceed పదం పై క్లిక్ చేయండి
7 సిటీ హైదరాబాద్ సూచిస్తుంది దానిని యథాతథం గానే ఉంచాలి మార్పు కై ప్రయత్నం చేయరాదు
8 జనరల్ OPD తరువాత ముందుగా లబ్థి దారుని సంబంధించిన వెల్నెస్ సెంటర్ కనిపిస్తుంది -- మార్పు కావలసినవారు దానిపై క్లిక్ చేసి కావాల్సిన వెల్నెస్ సెంటర్ కు మారవచ్చు
9 లబ్థి దారుడు ఎంచుకున్న వెల్నెస్ సెంటర్ రోస్టర్ లో ఉన్న డాక్టర్స్ పేర్లు చూడగలరు - కావాల్సిన డాక్టర్ పేరుపై క్లిక్ చేయండి అపాయింట్మెంట్స్ లభ్యత ఉన్న ఎడల బుక్ చేసుకోవచ్చు లేని ఎడల చేంజ్ ఆప్షన్ ఉపయోగించి మరియొక డాక్టర్ గారి అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నం చేయాలి.
10 చేంజ్ ఆప్షన్ ఉపయోగించి వెల్నెస్ సెంటర్ కూడా మార్పు కోరవచ్చు - మెడికల్ ఆఫీసర్ మార్పు కోరవచ్చు
11 డాక్టర్ అపాయింట్మెంట్స్ లభ్యత ఉన్న ఎడల తారీఖు పై క్లిక్ చేయండి -- మీరు ఎంపిక చేసిన తారీఖు సంబంధించిన టైం స్లాట్స్ చూడగలరు - మీకు కావలసిన సమయం (లభ్యతను అనుసరించి) పై క్లిక్ చేయండి అపాయింట్మెంట్ పొంది దాన్ని కన్ఫర్మ్ చేసుకొనండి
12 లబ్థి దారుని మొబైల్ కు సమాచారం వస్తుంది దానిని లో మీరు బుక్ చేసుకున్న వెల్నెస్ సెంటర్ - డాక్టర్ పేరు - క్యూ నెంబర్ - ఛాంబర్ నెంబర్ - తేది తో కూడిన సమాచారం ఉంటుంది
ఇప్పుడు అన్ని smartphones లో My cghs యాప్ లబిస్తుంది Play Store నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
My Cghs యాప్ లో CGHS సంబంధించిన సకల సమాచారం ఉంటుంది cghs City ల వారిగా లబ్థి దారుల cghs కార్డులు కూడా లభ్యత ఉంటుంది
అపాయింట్మెంట్స్ ఆన్ లైన్ లోనే పొంది విలువైన సమయాన్ని ఆదా చేసుకుందాం -- వెల్నెస్ సెంటర్ లో రద్దీ / వేచి ఉండు సమయాన్ని తగ్గించు కొందాం హుందాగా వెల్నెస్ సెంటర్ కు హాజరు అవుదాం
9985945746
KVD SWAMI
Local advisory committee members WC 1
0 Comments