సింహచలం దేవస్థానం వారి ఆవరణలోశ్రీ సూర్యభగవానుడి విగ్రహం
సింహచలం దేవస్థానం వారి గోశాల (కృష్ణాపురం వద్ద) ఆవరణలో సుమారు 5 సంవత్సరాల క్రితం అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు గారి అభీష్టం మేరకు శ్రీ సూర్యభగవానుడి విగ్రహం ప్రతిష్టించారు.. అప్పటినుండి ప్రతీ రథసస్తమి నాడు సింహచలం దేవస్థానం వేద పండితులు వేదపారాయణం చేసి ప్రత్యక్ష నారాయణుడికి పూజలు నిర్వహిస్తారు.. కానీ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం కొందరు భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు... ఆదివారం అయితే ఉదయం నుండి ఎక్కువ భక్తులు వచ్చి శ్రీ సూర్యభగవానుడ్ని దర్శించుకుంటున్నారు.. కిందటి రధసప్తమి రోజున మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దర్శించుకుని ప్రతీ ఆదివారం ఇక్కడ దేవస్థానం పురోహితులచే పూజలు, అభిషేకాలు చేయించమని దేవస్థానం కార్యనిర్వాహక అధికారిణి కి ఆదేశించారు.. అప్పుడు ఒక రెండు వారాలు చేసి మానివేశారు.. దేవస్థానం వారు మాత్రం సంవత్సరానికి ఒక్కసారే అదికూడా రధసప్తమి రోజునే స్వామివారి ని అలంకరిస్తున్నారు... మిగిలిన రోజుల్లో స్వామి వారికి అలంకరణ, పూజలు లేవు .
ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నారాయణుడిని ప్రతీరోజు దర్శించుకునే భక్తులలో కొంతమంది సేవా సమితి గా ఏర్పడి ప్రతీ ఆదివారం ఉదయం 5.00 గం లకు వచ్చి స్వామివారి విగ్రహాన్ని జలంతో పూర్తి గా శుభ్రం చేసి క్షీరాభిషేకం నిర్వహించి.. వస్త్రాలు, పూలమాలలు తో స్వామివారి ని అలంకరించి పూజలు చేస్తున్నారు... వారే ఇంటిదగ్గర ప్రసాదం వండి స్వామి వారికి నివేదించి సుమారు 12 గం ల వరకు వచ్చే భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు.. పరిసరాలను శుభ్రం చేసి పూల మొక్కలను నాటారు... ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిన్న ఉదయం ఈ సేవాసమితి సభ్యులు చేసిన సేవా కార్యక్రమాలు వీక్షించి... మీరుకూడా వీలున్నప్పుడు సింహచలం అప్పన్న గోశాల లో సూర్యభగవానుడ్ని దర్శించ ప్రార్ధన..
0 Comments