Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

పొందూరు ఖాదీ..

 

 పొందూరు ఖాదీ..’  తెలుగోడి బ్రాండ్‌'

‘పొందూరు ఖాదీ..’ ఇది తెలుగోడి బ్రాండ్‌.గాంధీజీ మెప్పు పొందిన నాణ్యత  హుందాతనానికి తార్కాణం పురాతన పద్ధతులతో తయారీ.. ఉత్తరాంధ్ర ప్రత్యేకం

ఎలాంటి రసాయనాలు వాడకుండా.. విత్తు నుంచి బట్టతయారీ వరకు పురాతన పద్ధతులతో, పర్యావరణ హిత ప్రక్రియను అనుసరించడం పూర్వం చూసి ఉంటాం. యంత్రాల రాకతో సంప్రదాయ తయారీకి స్వస్తి పలికారు. కానీ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని ‘పొందూరు ఖాదీ’ భండార్‌లో నేటికీ పాత పద్ధతిలోనే వస్త్రాలు తయారు చేస్తున్నారు. వినూత్న తయారీ, నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ ఇప్పుడు మరో ఘనత సాధించింది. పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి చొరవతో ఈ నెల 12న జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ పొందింది. అరుదైన, ప్రత్యేక ఉత్పత్తులకే ఈ గౌరవం లభిస్తుంది. పొందూరు ఖాదీ దుస్తుల తయారీలో ప్రధానంగా ఏడు దశలు ఉంటే ఒక్కో దశకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 

కొండ పత్తి మాత్రమే..:పొందూరు ఖాదీ వస్త్రాలు తయారు చేసేందుకు కొండ పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాల్లో పండదు. నల్లరేగడి నేలలో మన్యం, విజయనగరం, శ్రీకాకుళం వంటి కొన్ని ప్రదేశాల్లోనే పండుతుంది. సొసైటీ వాళ్లే రైతులకు విత్తనాలు ఇచ్చి పంట కొనుగోలు చేస్తారు. ఈ కొండ పత్తితో పొందూరు ఖాదీ వస్త్రాన్ని మాత్రమే చేయగలరు తప్ప మరెవరికీ ఈ పత్తి ఉపయోగపడదు.

ఏడు దశల్లో తయారీ..

1. చేప దవడతో శుభ్రం చేయడం: ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో దొరికే వాలుగ చేప దవడతో మొదటి దశలో పత్తిని శుభ్రం చేస్తారు. చేప దవడ భాగాన్ని నాలుగు భాగాలుగా చేసి పత్తిని చేప పళ్లతో శుభ్రపరుస్తారు.

2. నిడచడం: చెక్కతో చేసిన నిడుపురాట్నం ద్వారా పత్తిని, గింజని వేరుచేస్తారు. 

3. చిగిలించి పింజ చేయడం, పొట్లు తీయడం: గింజ నుంచి పత్తిని వేరు చేశాక, అందులో ఉండిపోయిన చెత్తనూ తొలగిస్తారు.

4. పత్తిని మెత్తగా చేయడం:రేగి కర్రకు సన్నటి తాడు కట్టి పత్తిని కొడతారు. దీంతో అది విడిపోయి మెత్తగా తయారవుతుంది.

5. పత్తిని ఏకి దానిని చుడతారు:మెత్తగా చేసిన పత్తిని చుట్టుపుల్లతో చుడతారు.

6.సన్న నూలు వడకడం:అరటి దవ్వలో పత్తిని రాట్నం ద్వారా తిప్పుతారు. 

7. హేంకరుపై నూలుపోయడం.హేంకరు చుట్టుకొలత ఒక రౌండుకు మీటరు ఉంటుంది. ఇలా వెయ్యిసార్లు తిప్పితే ఒక చిలప తయారవుతుంది. అనంతరం తయారైన చిలపలను చేనేతలకు పంపిస్తారు.  

మూడు కేజీల చిలపలతో నేతన్న బట్ట తయారు చేస్తారు. దీంతో 18 చొక్కాలు తయారవుతాయి. ఖాదీతో కర్చీఫ్‌లు, తువ్వాళ్లు, చీరలు, పంచెలు తయారవుతాయి. 

మూడు రకాలుగా ఖాదీ

మొదటిది ప్రాంతీయ ఖాదీ:దీని ధర మీటరు రూ.1200 నుంచి రూ.2,600 వరకు ఉంది. 

మజిలిన్‌ ఖాదీ: మీటరు రూ.500 నుంచి రూ.800 ఉంటుంది. 

అంబర్‌ ఖాదీ:మీటరు రూ.400 నుంచి రూ.600 ఉంటుంది. 

రసాయనాల రహిత ఈ ఖాదీ వస్త్రాలు ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటాయి. వీటిని ధరిస్తే హుందాగా కనిపిస్తారని ప్రతీతి.

ఘన చరిత్ర పొందూరు ఖాదీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లో ఈ వస్త్రాలు బాపూజీ దృష్టికి వచ్చాయి. నాణ్యతను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో ఓ కథనాన్ని రాశారు. పొందూరు ఖాదీ 1949లో సంఘటిత రంగంలోకి వచ్చింది. 1955 అక్టోబరు 13వ తేదీన ఖాదీ సంస్థ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పొందూరు ఖాదీలో 600 మంది స్పిన్నర్లు (ఒడికేవారు), 100 మంది వీవర్స్‌(నేతవారు) ఉన్నారు. 

Post a Comment

0 Comments