Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

statue of equality sri bhagvdraamanujulu vaaru

 భగవద్రామానుజులు (1017-1137)





భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియరాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు.

నాటి వారి స్పూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని మరో వెయ్యేళ్ళు రామానుజుల వారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం.

ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతలో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.

లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్)

ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజుల వారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది.

ఉజ్జీవన సోపానాలు
లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు.

భద్రవేది - బంగారు రామానుజులు
రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచన మండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజుల వారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32 బ్రహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ నెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు.

విహంగ వీక్షణల దివ్య వేమన శిఖరాలు.. ఎతైన గౌరవాలు.. గొప్ప శిల్ప కళాశోభితమైన అనుపాలు.. అనేక ప్రాచీన శిల్ప శైలీ సంపన్నమైన స్వాగత తోరణాలు.. రామానుజ ఆచారయాభిషేకం చేసే లీలాజల నిరాజనం (వాటర్ ఫౌంటెన్) పచ్చటి ఉద్యానవనాలు.. సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు.. ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపనామార్గం.. ఆపై భద్రవేది పై పద్మ ఆసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శన మిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించిన వారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు.

ప్రవేశద్వారం

ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చ్చేరు వొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు వున్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. వాటి విశేషాలను తెలుకోవడానికి ఒక రోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది

 ఒక వైపు ప్రవేశద్వారం మరో వైపు నిష్క్రమణ ద్వారం వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు స్వాగతతోరణాలు మొదలైనవాటి గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిందే.

చుట్టూ 108 దివ్యదేశాలు భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమ పదం .
ఆచార్య దర్శనం భగవద్రామానుజుల వారి దివ్య విగ్రహం కింద ఏనుగులు,వాటిపై పద్మాలు ఉన్న ఆసనం పై ఉంటుంది. ఆచార్యుల వారు ఆసీనులై రెండు చేతులను జోడించి శరణాగతి మార్గమే సకల జనులకు ఏకైక మార్గమని, భగవంతుని నిరంతరం భక్తితో కొలవమనే సందేశంతో, చేతులకు బంగారు కంకణాలతో తిరునామాలను, తులసి మాలలను ధరించి, శిఖాయజ్ఞోపవీతాలతో ప్రసన్న వదనంతో.. కరుణాపూరిత నేత్రాలతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు.
ప్రాజెక్టు విశేషాలు
• స్వామివారి పద్మపీఠం ఎత్తు 27 అడుగులు.
• స్వామి వారి ఆసీన రూపం ఎత్తు 108 అడుగులు.
• స్వామి వారి నుండి త్రిదండం ఎత్తు 27 అడుగులు. ప్పుడు రామానుజులవారు
• కేవలం త్రిదండం ఎత్తు మాత్రమే 153 అడుగులు
. ఆయన ముందున్న శఠగోపం ఎత్తు 18 అడుగులు.
ప్రాజెక్టు విశేషాలు
. ఈ ప్రాజెక్టు మొత్తం 45 ఎకరాలలో గుండి. అందులో సమతా సుపూర్తి కేంద్రం 25 కరాలు
. రామానుజులవారు ఉత్తరాభిముఖంగా వుంటారు.
. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏకొలతను కూడి చుసిన 9 శాఖ రావడం విశేషం.
. క్రింద నుండి స్వామివారి విగ్రహం పూర్తయితు 216 అడుగులు. 2+1+6=9
. 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.
. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 6 సంవత్సరాలు పట్టింది.
. భద్రవేది, ప్రవేశద్వారం స్వాగత తోరణాల నిర్మాణానికి బన్సిపహాడీపూర్ పింక్ స్టోన్ ఉపయోగించారు.
. ఫౌంట్ అబూ ప్రాంతంలోని కొన్నివందల శిల్పులు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
. 108 దేవాలయాలకు, దేవతావిగ్రహాల నిర్మాణానికి కృష్ట్ణశిలను ఉపయోగించారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి రామానుజ సహస్రాబ్ది సమారోహం' ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైనవారు మరోవైపు ఆధ్యాతిక సాంప్రదాయానికి సంబందించిన అనేక మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
సర్వప్రాణులూ సమానమే! భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. లౌకిక, బాహ్య ఉపయోగాలను పొందడానికి ఈవెయ్యేళ్ల పండగ జరుపుకుంటున్నాం. లోకంలో ఉన్న అన్నిఅనమానతలను తొలగించడానికి వెయ్యేళ్ల క్రితమే సమతాస్పూర్తి కలిగించినవారు రామానుజాచార్యులు. మానవుడినే కాదు సర్వప్రాణికోటిని జాగ్రత్తగా కాపాడుకోమని సూచించారు రామానుజులు. మన శరీరంలో ఏ భాగాన్ని మనం తక్కువ చేయనట్లే. ఏ జీవికీ హాని చేయకూడదని, ప్రతి జీవినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. స్త్రీ, పురుష, కుల, మత వర్గ భేదం లేని సమాజం కోసం పరితపించారు.రామానుజులు. మనలో కూడా ఒక్కొక్కరు రామానుజుల స్థాయికి ఎదిగేంతగా తయారవ్వాలనేది మూల ఆశయంగా ఈ ప్రాజెక్ట్ ని మానవజాతికి సమర్పణ చేసే మహోద్యమం ఇది చిన్నజీయర్ స్వామి.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం భగవద్రామాసుజులవారు సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. ఆ సమతాస్పూర్తి వారిలో చాలా చిన్న వయసు నుంచే ఉంది వారికి తంజమాంబతో వివాహం జరిగింది. ఒకనాడు రామానుజుల వారు వారి గురువైన తీరుక్కచ్చినంబిగారిని ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఆయన వైశ్యుడు. ఆయన వచ్చేసమయానికి రామానుజులవారు ఇంట లేరు.

గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుటకుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు.విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవా లను ప్రదర్శించారు . యాదవ ప్రకాశులనే వేదాంతగురువుపాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూవాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ 'సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి' అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో
తాటాకులతో నిర్మించిన యాగశాలలు. మట్టి, ఇటుకలు గోమయంతో నిర్మించిన హోమకుండలు. జనపనార తెరలువెదురు తడకలు, మట్టి కుండలు.. ఎక్కడా ప్లాస్టిక్, సిమెంట్ వాడకుండా ఏర్పాటు చేసిన యాగశాలలో ధ్వనించే మంత్రోచ్చారణతో , హోమకుండలలో సహజమైన ఆవు నెయ్యి సమర్పణతో పర్యావరణ శుద్ధి జరిగి వైరస్ నుంచి విముక్తి కలిగిన సమస్త ప్రాణికోటి శుభాలను పొందాలనే సంకల్పానికి సరైన సమతా స్ఫూర్తికి శ్రీకారం

విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం వైష్ట్నవ సంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచినా గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తయిన మండపాల్లో కొలువుతీరాయి. హంసధ్వరం యాళిద్వారం వారిపై కాకతీయ స్వాగత తోరణాలను నిర్మించిన ఈ నేలపై పరిడవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది.

దక్షిణాది, ఉత్తరాది శిల్ప శైలులను గుర్తుకు తెచ్చే అనేక విమానసిఖరాలు.ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్ళముందు నిలుస్తుంది.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీ యుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరి చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని అందరికీ వినిపించేలాచెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవు నిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు.
వైష్ణవ సంప్రదాయంలో పన్నెండుమంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణు భక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలంలో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు.
నలుగురి మంచికోసం నరకానికైనా... కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబం ధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, రంగా చార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకుతట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు. రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది గోష్ఠీపూర్ణులవారు. 'అనరులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!" అని చెప్తే 'అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు' అని అన్నారు. రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో'నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!' అనిరామానుజలవారిని గౌరవించారు.
దివ్యవిమానశిఖరాలు..ఎత్తైన గోపురాలు.. గొప్ప .శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీ సంపన్నమైన స్వాగత తోరణాలు.. రామానుజ ఆచార్యాభి.షేకం చేసే లీలాజల నీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని .చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మా
అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా?సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్వానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్ధమే కాని, వేరుకాదుఅని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతి రేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు.అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికి భేదం లేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది, కాని, అసంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచి స్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య,జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటిపరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని మూర్తీభవించిన సమత పరిపూర్ణంగా చిత్రించలేవు కదా!

Post a Comment

0 Comments