Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

'అగ్నిపథ్' పథకం కింద జవాన్ల నియామాకాలకు నోటిఫికేషన్


సైన్యంలో 'అగ్నిపథ్'
నోటిఫికేషన్ వచ్చే నెల నుంచి ఆన్‌లైన్ రిజిస్టేషన్ల ప్రక్రియ ప్రారంభం • ప్రత్యేక ర్యాంకుగా అగ్నివీరులు, వైద్య పరీక్షలు, ఫిజికల్/రాత/ఫీల్డ్ పరీక్షల ద్వారా ఎంపిక • సైనికులు, మాజీ సైనికుల సంతానానికి 20 బోనస్ మార్కులు.

అగ్నిపథ్ పథకం కింద జవాన్ల నియామాకాలకు భరత్ సైన్యం సోమవారం నోటిఫికేషన్ జారి చేసింది. దరఖాస్తుదారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. www.joinindianarmy. nic.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . ఈ స్కీము క్రింద చేరే అగ్నివీరులను ప్రత్యేకమైన ర్యంకుగా పరిగణిస్తారు. అవి ప్రస్తుత ర్యాన్కు లకు బిన్నంగా ఉంటాయి. అధికార రహస్యాల చట్టం-1923 ప్రకారం అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీసులో తెలుసుకొన్న సమాచారాన్ని ఇతర అనధికారిక వ్యక్తులకు చేరవేయడం నేరమని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, ఫిజికల్/రాత/ఫీల్డ్ పరీక్షల ద్వారా అగ్నివీరులను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది.

ఇవీ అర్హతలు

*జనరల డ్యూటీ పదో తరగతిలో కనీసం 45 శాతం మార్కులుండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు తప్పనిసరి.

*టెక్నికల్ క్యాడర్ * ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఇంగ్లీష్ సబ్జెక్టు లతో 12వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి.

*క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్) * ఏ విభాగంలోనైనా కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి పాసవాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు ఉండాలి ఇంగ్లిష్, మ్యాథ్స్/ఎకౌంట్స్/బుక్ కీపింగ్ లో కనీసం 50 శాతం మార్కులు ఉండడం తప్పనిసరి.

*ట్రేడ్స్మేన్ కేటగిరి * రెండు కేటగిరీలు ఉండగా, మొదటి కేటగిరీకి 10వ తరగతి ఉత్తీర్ణత తప్ప నిసరి . ప్రతి సబీజెక్టులో 33 శాతం మార్కులు ఉండాలి

మరియు ఇంకా

* ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న వారి సంతానానికి, మాజీ సైనికుల సంతానానికి, వార్ విడో సంతానానికి, ఎక్స్-సర్వీస్ విడో సంతానానికి అగ్నిపధ్ కింద వుమ్మడి ప్రవేశ పరీక్షలో 20 బోనస్ మార్కులు ఇస్తారు

*ఎన్సీసీ సర్టిఫికెట్లుంటే బోనస్ మార్కులు ఇస్తారు.

*నాలుగేళ్ల తర్వాత తమను సైన్యంలోనే కొన సాగించాలని వాదించే హక్కు అగ్నివీరులకు లేదు.

*అగ్నిపధ్ కింద నియామక ప్రక్రియలో భాగంగా అన్ని రకాల నియమ నిబంధనలకు అగ్నివీరులు అంగీకరించాల్సి ఉంటుంది.

*18 ఏళ్ల లోపు వారు అభ్యర్థులకు తల్లిదండ్రు లు లేదా సంరక్షకులు సంతకం చేయాలి

*అగ్నివీరులకు ఏటా 30 సెలవులుంటాయి. - మెడికల్ లీవ్ కూడా ఇస్తారు. ఈ సర్వీసు ముగిశాక రెగ్యులర్ కేడర్‌లో చేరడానికి అగ్నివీరు రులు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వీసులో కస - బర్చిన ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసులో చేర్చుకుంటారు.

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

 


Post a Comment

0 Comments