రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక విశ్లేషణ
దేశ ప్రధమ పౌరుడు, జాతి సమైక్యతకు, సమగ్రతకు ప్రతీకగా నిలిచే రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ద మైంది . దేశానికి 16వ రాష్ట్ర[అతి ఎన్నుకోవడానికి జులై 18న ఓటింగు జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికలకి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హోరా హోరి పోరు వున్నప్పటికీ ఎన్డీయే, ఆదివాసీ మహిళా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికులు ముర్ముకే జై కొట్టడంతో ప్రతిపక్షాల వుమ్మడి అభ్యర్థిగా యాశ్వంత్ సిన్హాతో పోరు ఏకపక్షంగా సాగుతున్నందన్న అంచనాలున్నాయి. ద్రౌపది ముర్ముగారు వెంట 44 పార్టీలు ఉంటే, సిన్హాకు మద్దతుగా 34 పార్టీలున్నాయి. బీజేడీ, వైస్సార్సీపీలతో పాటు శివసేన, జేఎంఎం, టిడిపి, అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి పార్టీలు ద్రౌపదిముర్ముగారుకి మద్దతు ప్రకటించాయి. దీంతో ఓకే ఆదివాసీ మహిళా దేశ అత్యున్నత పీఠంపైకెక్కడం లాంచన మనే చెప్పాలి. ముర్ము గారు గెలిస్తే దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.
పార్టీల వారీగా బలాబలాలు క్లిక్ ఆన్ https://mohansanapala.wordpress.com/2022/06/20/how-to-elect-president-of-india-who-are-eligible
ఎన్నిక ప్రక్రియ.
పార్లెమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్ అయినా ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటింగ్ లోపాల్గొనే అర్హత లేదు. ఓటింగ్ రహస్య పద్దతిలో జరుగుతుంది. దీంతో క్రాస్ ఓటింగ్కు అవ కాశాలుంటాయి. ఎంపీలకు ఆకుపచ్చరంగు బ్యాలెట్. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఇవ్వనున్నారు. బ్యాలెట్ పత్రాల్లో రెండు కాలములు ఉంటాయి. అవే అభ్యర్థి పేరు, ఆర్డర్ ఆఫ్ ప్రిపరెన్స్. పోటీపడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యం ఓటు ఎవరికో తప్పనిసరిగా వేయాలీ. అప్పుడే ఓటు ఛెల్లుతుంది. రెండోది ప్రాధ్యాన్యం ఓటు ఐచ్ఛకం .
విజేతని నిర్ణయించేది ఇలా
రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరిగితే, ఓట్ల లెక్కింపు జులై 21న జరుగుతుంది. ప్రాతీ ఎంపీకి, ఎమ్మెలేకి ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్లేల ఓటు విలువని వారు ప్రాథినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారిపోతుంది. అన్ని రాష్ట్రాల ఎమ్మెలేలు మొత్తం ఓటు విలువని పార్లమెంటు సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే దానిని ఎంపీ ఓటు విలువగా నిర్ధారిస్తారు. ఈ సారి జమ్మూ కశ్మిర్ రాష్ట్రంగా లేకపోవడంతో 708గా ఉండాల్సిన ఎంపీ ఓటు విలువ 700కి తగ్గింది ఎమ్మెల్ల్యేలు, ఎంపీలందరిని ఎలెక్ట్రోల్ కాలేజిగా వ్యవహరిస్తారు. 776 మంది లోక సభ , రాజ్యసభ సభ్యులు, 4120 మంది ఎమ్మెల్ల్యేలు మొత్తంగా 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఎలెక్ట్రోల్ కాలేజీ ఓట్ల విలువ 1086431 కాగా అందులో కనీసం 50% కంటే ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. అంటే 548442 కి పైగా ఓట్ల విలువ వచ్చిన వారు అత్యు న్నంత పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముగారికి మద్దతునివ్వడంతో ఆమెకు 6 లక్షలకు పైగా విలువైన ఓట్లు పో లవుతాయి అని అంచనా. ఇంచుమంచుగా మూడింట రెండు వంతుల మెజార్టీతో విజయము సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీతభత్యాలు, జీవనము
దేశంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో వున్నా వారి అందరికంటే రాష్ట్రపతి జీతం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకి రూ 5 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. 2018లో రూ లక్షన్నర ఉన్న జీతాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. న్యూఢిల్లీలోని 340 గదులు, హాళ్లు వున్న రాష్ట్రపతి భవనం అధికారిక నివాసం. అందులోనే బసచేస్తారు. వేసవి కాలం, శీతా కాలం గడపడానికి రెండు విడిదిలు వున్నాయి. వేసవి విడిది సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది హైద్రాబాద్లో వుంది. ప్రసిడెంట్స్ బాడీగార్డ్(పిబిజీ) భద్రత ఉంటుంది. బారత్ ఆర్మీలో ఇదొక విభాగం ఏక్కడికైనా ఉచిత ప్రయాణాలు, కావాల్సినంత మంది సిబ్బింది వుంటారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ వున్నా కారులో ప్రయాణిస్తారు. రిటైర్ ఐయన తర్వాత రూ. లక్షన్నర పెన్సన్, ఉచిత నివాసం, ఫోన్, ఐదురుగురు సిబ్బంది, ఉచిత ప్రయాణ సదుపాయాలూ ఉంటాయి.
రాష్టపతి అధికారాలు - విధులు
- రాష్ట్రపతి దేశ ప్రధమ పౌరుడు. ప్రధాన కార్య నిర్వహణాధికారి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ రాష్ట్రపతి పేరు మీదే నిర్వహించాలి.
- దేశ కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టులు జడ్జీలు, ఆడిటర్ జనరల్ ఆర్ధిక సంఘాలను నియమిస్తారు. ప్రధానమంత్రిని, అయన సలహా మేరకు మంత్రిమండలికి రాష్ట్రపతి నియమిస్తారు.
- పార్లమెంటు ఆమోదించిన ఏ బిల్లైనా రాష్ట్రపతి సంతకం తర్వాతే చట్టరూపం దాల్చుతుంది. బిల్లులో తనకి నచ్చని అంశాలు ఉంటే రాష్ట్రపతి వెనక్కి తిరిగి పంపే అధికారం వుంది. రాష్ట్రపతి సిఫార్సు లేనిదే ఆర్ధిక బిల్లులేవీ సభలో ప్రవేశపెట్టకూడదు.
- దేశంలో త్రివిధ బలగాలకు అధిపతి రాష్ట్రపతి.
- దేశంలో అంతర్యుద్ధం చెలరేగి భద్రత అదుపు తప్పినా, సైనిక తిరుగుబాటు జరిగిన, విదేశాలు దండయాత్రకు దిగినా అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతిదే.
- సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షల పైన క్షమా భిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతి కి ఉంటుంది.
- ప్రధాని, మంత్రిమండలి లేకుండా రాష్ట్రపతి ఏమి చేయలేరు. కానీ దెస నిర్ణయాలను తెలియ జెప్పే ఒక అధికారిక హోదా, గొరవం ఈ పదవికి వున్నాయి.
ప్రస్తుతం బరిలో వున్న అభ్యర్థులు
ద్రౌపది ముర్ము అధికార పార్టీ అభ్యర్థి- వయస్సు: 64 సంవత్సరాలు
- నిర్వహించిన పదవులు : రెండు సార్లు ఒడిశా ఎమ్మల్యే, ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్య శాఖ మంత్రి, 2016-2021 వరకు జార్ఖండ్ గవర్నర్
- మద్దతునిస్తున్న పార్టీలు: 44
ద్రౌపది ముర్ము గారి అభ్యర్ధన
"ఒక గిరిజన మహిళా మాఆరుమూల వున్నా మయూరభంజ్ నుంచి వచ్చిన మహిళా దెస అత్తువైన్నత స్థానానికి జరిగే పోటీలో నిలబడడం అసలు నమ్మలేకపోతున్నాను. వెనుకబడిన వర్గానికి చెందిన నన్ను పిర్పీత్సహిస్తారని ఆశిస్తున్నాను."
యస్వంత్ సిన్హా ప్రతిపక్షాల వుమ్మడి అభ్యర్థి- వయస్సు: 84 సంవత్సరాలు
- నిర్వహించిన పదవులు: ఐఏఎస్ అధికారి . 1988 నుంచి రాజ్యసభ, లోక్సభలకు పలుమార్లు ఎన్నిక, కేంద్రంలోఆర్ధిక, విదేశాంగ శాఖల్లో పని చేసిన అనుభవం.
- మధ్దతునిస్తున్న పార్టీలు: 34
యస్వంత్ సిన్హా గారి అభ్యర్ధన
"నేను గిరిజనుడుగా పుట్టకపోయినప్పటికీ అణగారిన వర్గాల సంక్షేమము కోసం ద్రౌపది ముర్ము కంటే నేను ఎక్కువ చేసాను. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్న బీజేపీ కి గుణపాఠం చెప్పాలంటే నన్ను రాష్ట్రపతిగా ఎన్నుకోండి "




0 Comments