Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

వేదాలలో కొన్ని ఖగోళ విషయాలు – నేటి గణన

 వేదాలలో కొన్ని ఖగోళ విషయాలు – నేటి గణన

ఋగ్వేదము 1.50.4 లో సూర్యుని కాంతి యొక్క వేగం గురించి ప్రస్తావించబడి వున్నది.
దానికి సాయణాచార్యులు వారి భాష్యం లో ఇలా చెప్పారు.
“తధా చ స్మర్యతే యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే | ఏకేన నిమిషార్దేన క్రమమాన నమోస్తుతే || “
అంటే ఒక అర్ధ నిమేషంలో సూర్యకాంతి 2202 యోజనాలు ప్రయాణం చేస్తుంది అని.
1 నిమేషం = 16/75 s
అర్ధ నిమేషం = 8/75 s = 106.67ms
1 యోజనం = 8 miles = 12.8 kms
కాంతి వేగం = 2202 * 12.8 / .1066667 = 264000km/sec
మరొక ఆచార్యుని ప్రకారం 1 యోజనం = 9miles 110 యర్డ్స్ = 9.0625 miles = 14.5kms
దాని ప్రకారం కాంతి వేగం = 2202 * 14.5/0.106667 = 299934 km/s
నేటి ఆధునిక కొలమానం ప్రకారం కాంతి వేగం 299 792. 458 km / s
ఆనాటి యోజనానికి నేటి కొలమానం ప్రకారం పండితులలో 8km-16km వరకు అని మీమాంస వుంది. దాని మీద ఇంకా చర్చలు, పరిశోధన కొనసాగుతూ వున్నది. అలాగే తులసిదాస్ వారి విరచిత హనుమాన్ చాలీసా లో “ యుగ సహస్ర యోజన పర భాను లీల్యోతాహి మధుర ఫల జానూ “ అని చెప్పారు.
దాని ప్రకారం
1యుగం = 12000
సహస్ర = 1000
యోజన = 8 మైల్స్ = 12.8 kms
సూర్యునికి భూమికి వున్న దూరం = 12000 * 1000 * 12.8 km = 1536000000 kms = 153.6 millionkms
నేటి కొలమానం ప్రకారం అది 152 millionkms ఇక్కడ మనం చూడవలసినది ఏమిటంటే ఇప్పటి క్యాల్కులేషన్ ప్రకారం మనవారి గణన 10% కి అటు ఇటు గా వున్నది.
ఆనాడు ఎంత పరిపక్వత లేకపోతే ఇటువంటి గణన మనవారికి సాధ్యమవుతుందో ఆలోచించ0డి. అలాగే మన సూక్తాలలో ఆదిత్యుని స్తుతించేటప్పుడు “సప్తాస్వరధ మారూఢం ప్రచండం కస్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం” అని చెప్పుకుంటాము.
ఆయన సప్తాశ్వాలు మనము నేడు చెప్పుకుంటున్న VIBGYOR (ఏడు రంగులు – వయొలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరంజ్, రెడ్) కు ప్రతీకలు.
ఇలాంటివి ప్రపంచానికి మన సనాతన ధర్మం ఎన్నో ఇచ్చింది... మన భారత దేశం ప్రపంచానికి గురుస్థానం లో ఉండేది అని మర్చిపోవద్దు.... మెఖలే మరియు కంపునీస్టు లు చదువుల వళ్ల లాభం కన్న నష్టం ఎక్కువ....మన నిజమైన చరిత్ర తెల్సుకోండి తెలియచెప్పండి.. మరిన్ని వివరాలకు
👇👇👇👇👇👇👇👇👇👇
https://t.me/dharmaporatam 

Post a Comment

0 Comments