Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

నికోలస్ జేమ్స్ వుజిసిక్ baiography

 నికోలస్ జేమ్స్ వుజిసిక్ baiography 

 

నికోలస్ జేమ్స్ వుజిసిక్ జననం: 1982 డిసెంబరు 4  ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు.[

ప్రారంభ జీవితం 

వుజిసిక్ 1982 డిసెంబరు 4న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో దుసంక, బోరిస్లావ్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు. అతను రెండు కాళ్ళు, చేతులు లేకుండా టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను అరుదైన వ్యాధితో జన్మించినందున అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి నిరాకరించింది. తరువాత అతని తల్లిదండ్రులు పరిస్థితులను అర్థం చేసుకొని అతనిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ పరిస్థితిని "వారి కొడుకు కోసం దేవుని ప్రణాళిక" గా వారు అర్థం చేసుకొన్నారు.

అతను రెండు చిన్న, వైకల్య పాదాలను కలిగి ఉన్నందున, వాటి ఆకారం కారణంగా వాటిని అతను "చికెన్ డ్రమ్‌ స్టిక్" అని పిలిచేవాడు . వాస్తవంగా అతని "చికెన్‌ డ్రమ్‌ స్టిక్" గా పిలిచే అతని పాదాల వ్రేళ్ళు కలిసిపోయాయి. వాటిని విడదీయడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. దీని వల్ల అతను వస్తువులను పట్టుకోవటానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులకు చేయడానికి వ్రేళ్ళుగా ఉపయోగించవచ్చు. అతను తన పాదాన్ని విద్యుత్ చక్రాల కుర్చీని నడపడానికి, కంఫ్యూటర్, మొబైల్ ఫోన్‌ లను ఉపయోగించడానికి వినియోగిస్తాడు . వుజిసిక్ ఆత్మహత్యాయత్నం చేసాడు కానీ "అద్భుతంగా సాధారణ బాల్యం" తనకు ఉన్నట్లు తెలియజేసాడు 

ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు

వుజిసిక్ తన కౌమర దశ, యవ్వన దశలలో అనేక వేధింపులకు గురైనప్పటికీ అభివృద్ధి చెందాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లి అనేక వైకల్యాలతో బాధపడుతూ అభివృద్ధి చెందిన ఒక వ్యక్తిని గూర్చి ఒక వార్తాపత్రికలో కథనాన్ని అతనికి చూపించింది. అతను తన ప్రార్థన సమూహంలో చర్చలు చేయడం ప్రారంభించాడు.   అతను తన 21వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ, ఆర్థిక ప్రణాళిక అంశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు.

2005లో "లైఫ్ వితౌట్ లింబ్స్‌"  అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో "ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్" అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు 

అతను "ద బటర్‌ఫ్లై సర్కస్" అనే లఘు చిత్రంలో నటించాడు . 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో షార్ట్ ఫిలింలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు.

2011లో ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ సంస్థ ద్వారా "సమ్‌థింగ్ మోర్" అనే మ్యూజికల్ వీడియోను వుజిసిక్ విడుదల చేసాడు.

వ్యక్తిగత జీవితం 

2002 మార్చి 9న అతను కాలిఫోర్నియాకు మారాడు. 2008 లో డల్లాస్ కు సమీపంలోని మిక్‌కిన్నీ లో కానే మియహరాను కలిసాడు. వారు 2012 ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు  వారికి నలుగురు పిల్లలు.  వారు దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు.

పుస్తకాలు, ప్రచురణలు 

వుజిసిక్ మొదటి పుస్తకం "లైఫ్ వితౌట్ లిమిట్స్" రాండం హౌస్ ద్వారా 2010లో ప్రచురితమైనది. ఇది 30 భాషలలో అనువాదమయింది. 

Post a Comment

0 Comments