Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము


 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శరభేశ్వరశాస్త్రి నుండి సెలవు పుచ్చుకొని, శంకరభట్టు, ధర్మ గుప్తుల వారు ప్రయాణము కొనసాగించిరి. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక, పరలోక సాధనమని తలించితిరి. కొంతదూరము ప్రయాణించిన తదుపరి ఒక ఆశ్రమప్రాంతము గోచ రించినది. 

ఆ ఆశ్రమము నందు సిద్ధుడు అను మహర్షి ఒకడు ఉండెను. అతడు పూర్తిగా వైరాగ్యవంతుడు. కౌపీనధారియై ఉండెను. ఆశ్రమము వాకిట నిల్చొని ఉండిన ఇద్దరు శిష్యులు, శంకరభట్టు, ధర్మగుప్తుడు మీరేనా అని ప్రశ్నించిరి. అవునని జవాబు ఇచ్చిరి. ఇద్దరినీ లోపలికి కొనిపోయిరి.లోపల తారాదేవి విగ్రహము ఉండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది. 

మధ్యాహ్న సమయమాయెను. పూజానంతరం భజన కావించబడెను. ఆ తదుపరి వీరికి సమృద్ధి అయిన భోజనమీయబడెను.ఆ సిద్ధుడు నాయనలారా! మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియజేసిరి. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఈయబడినది. నేను తారాదేవి ఉపాసకుడను. సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపచేయునది అగుట వలన ఈ మహాతల్లిని తార అని వ్యవహరించెదరు. 

అనాయాసముగానే వాక్ శక్తిని ప్రసాదించుట వలనను, భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించునది కావున ఈమెను నీలసరస్వతి అని వ్యవహరించెదరు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము.మరియొకరు మహర్షి.

ఒకానొక రాక్షసుడు హయగ్రీవుడు అని వ్యవహరింపబడేవాడు.హయగ్రీవుడు అను రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీలవిగ్రహరూపిణీ అయినది.ఈ దేవీ ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు.

భరతవర్షమున మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్టమహర్షి. ఈమెను వసిష్టారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు.నేను తారోపాసన చేయుచున్ననూ నాకు ఏనాడూ తారాదేవి దర్శనము కాలేదు. 

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments