Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

చరిత్రపుటలలో బీజాపూర్


చరిత్రపుటలలో బీజాపూర్

1520 లో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా బీజాపూర్ ( విజాపురము) దండయాత్రకు స్వయంగా బయలుదేరాడు. బీజాపురము పాలకుడైన ఇస్మాయిల్‌ ఆదిల్షా ముద్గల్లును, రాయచూరును అక్రమించాడు. సయ్యద్ అనే గుఱ్ఱాల వ్యాపారి ఆరేబియా గుఱ్ఱాలను శ్రీకృష్ణదేవరాయలకు సరఫరా చేస్తానని డబ్బు తీసుకొని అలా చెయ్యకుండా బీజారములో ఆశ్రయము పొందాడు. ఈ రెండు కారణాల వలన శ్రీకృష్ణదేవరాయలు బీజాపురముపై యుద్ధము ప్రకటించాడు.

మహామంత్రి తిమ్మరుసు, రాయసము కొండమరుసు,పెమ్మసాని రామలింగ నాయుడు, గండికోట కుమార తిమ్మానాయుడు, వెలుగోడు గంగాధరరెడ్డి, అకినీడు ఇమ్మరాజు, ఆరవీటి నారపరాజు, ఆరవీటి శ్రీరంగరాజు, పెమ్మసాని రామలింగనాయకుడు (కామనాయుడు) మొదలైన మంత్రి దండనాయకులతో యుద్ధానికి బయలుదేరాడు. చక్రవర్తి మొదట తన ఇష్టదేవతలకు పూజలు, బలులు సమర్పంచిన తరువాత కదన రంగములో కాలు పెట్టాడు. మొదట రాయచూరు కోటపై దాడికి దిగడము జరిగింది.

యుద్ధానికి బయలుదేరడానికి చిహ్నంగా నగారాలు కాహళాలు ఢక్కాలు కొమ్ములు మోగాయి, ఆ శబ్దము ఎంత పెద్దదంటే ఆ సమయములో ఆకాశములో ఎగురుతున్న పక్షులు ఆ ఘోర రవానికి కిందపడి చచ్చిపోయాయి. ఆ ఘోషలో ఒకరిమాటలు ఒకరికి వినబడలేదు, కేవలము సైగల ద్వారానే మాట్లాడుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా కూడా యుద్ధసన్నద్ధుడై కృష్ణానదికి ఆవలివైపున విడితి చేశాడు. ఇరుపక్షాలు యుద్ధానికి దిగకుండా కొన్నాళ్ళు కాలయాపన చేశాయి, బహుశా ఎదుటి బలాన్ని అంచనా వేయడానికేమో. తన సైనిక బలము, ఫిరంగుల సంఖ్యను అంచనా వేసి గెలుస్తానని నమ్మకముతో మొదట ఆదిల్‌షానే నదిని దాటి యుద్ధానికి నాంది పలికాడు.
ఆదిల్ షా ఫిరంగులన్ని ఒక్కసారిగా పేలాయి. ఆ పేలుడు దాటికి శత్రుశిబిరములో ఎన్నో ఏనుగులు గుఱ్ఱాలు, ఒంటెలు, మరెందరో సైనికులు నేలకూలారు. రాయలసైన్యములో అలజడి రేగింది.సైనికులు భయవిహ్వలులైనారు. దాంతో కృష్ణరాయడే స్వయంగా రంగములోనికి దిగి తనసేనలలో ధైర్యాన్ని పాదుకొల్పాడు, రాయలే స్వయంగా కదనరంగములోనికి ఉరికే పాటికి విజయనగర సైనికులు రెట్టించిన ఉత్సాహముతో శత్రుశిబిరముపై పడ్డారు. వారి ధాటికి శత్రు శిబిరము కకావికలమైపోయింది. అశ్వాలు ఏనుగులు సైనలు విరుచుకుపడ్డాయి. ఆ దెబ్బకు ఆదిల్షా సేనలు తమ స్థావరాలను వదిలి కాలికి బుద్ధి చెప్పాయి, కొందరు ప్రాణాలను కాపాడు కొనేటందుకు నిండుగా ప్రవహిస్తున్న కృష్ణలో దూకేశారు. శత్రుగుడారాల నుండి బయటకు వచ్చిన స్త్రీలు, పిల్లలు, వర్తకులు, నాట్యకత్తెలు వేశ్యలు మొదలైనవారు పరుగులంకించుకొన్నారు. విజృంభించిన రాయల సేనలు దొరికిన వారిని దొరికినట్టే నరికేయసాగాయి. ఈ తీవ్రమైన గందర గోళ పరిస్థితిలో ఆదిల్‌ షా తన శిబిరానికి వెళ్ళిపోయాడు. శత్రువులపై జరుగుతున్న ఊచకోత చూచి జాలిపడి రాయలు యుద్ధము ఆపమని ఆదేశించాడు.
శ్రీకృష్ణరాయల దండనాయకులు ఆదిల్‌షా శిబిరముపై దాడి చేయాలని కోరారు, మనము శత్రువును తరుముకొంటూ ఇంకా దూరంగా వెళ్ళడము సమంజసము కాదని, ఇంకా రాయ చూరును ఆక్రమించుకోవాలని కనుక ఆదిల్షాను వెంబడించడము వద్దని చెప్పాడు.
రాయల సేనలు శత్రుశిబిరములో గల నాలుగువేల గుఱ్ఱాలను వంద ఏనుగులను తొమ్మిది వందలు ఫిరంగులను మోసేబండ్లు, నాలుగువందలు పెద్దఫిరంగులు వేలకొద్ది చిన్నఫిరంగులను సరుకులు మోసే వేలకొద్ది ఎద్దులు కంచరగాడిదలను స్వాధీనము చేసుకొన్నాయి. శ్రీకృష్ణ దేవ రాయలు ఈ యుద్ధములో చనిపోయిన దాదాపు 16 వేలమంది సైనికులకు అంతిమ సంస్కారాలు జరిపించాడు. వారికి వీరస్వర్గము లభించాలని ఎన్నో . దానధర్మాలు చేశాడు. తరువాత రాయల సేనలు రాయచూరును ముట్టడించాయి. పోరుసాగుతండగానే కోటలోపలి నుండి మూరులు (తురుష్కులు) కోటద్వారము తెరచుకొని తెల్లజెండాలు ఎత్తిపట్టి రాయల చెంతకు చేరి రక్షించ మని కాళ్ళమీద పడ్డారు, సాష్టాంగదండ ప్రమాణాలు చేశారు.రాయలు వారిని క్షమించానని వారి ఆస్తులకు మానాలకు రక్షణకల్పిస్తానని మాట ఇచ్చాడు. గెలిచిన సందర్భంగా రాయల సేనలు విజయోత్సాహముతో విందులు వినోదాలలో మునిగిపోయాయి.
పై ఉదంతాలను డోమింగో పేయిన్‌ యాత్రికుడు నమోదు చేశాడు.

Post a Comment

0 Comments