"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం" ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. "మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి.
ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.
అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.
స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది.
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి
దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం). భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి"
అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం.
అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి"గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.
latest news, employment news , govt orders, political comments, talent in all, movie clipping (Telegu and English) latest medical and market news, facts of culture, stock market, history of events tourism
0 Comments