శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో భాస్కరశాస్త్రి తెలియజేస్తున్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము.
భాస్కరశాస్త్రి: మనిషి అభివృద్ధి పొందాలంటే, ముఖ్యముగా శ్రర్ధ, దానితో పాటుగా దృఢమైన విశ్వాసము ఉండాలి.శ్రర్ధ అంటే సంపూర్ణమైన నమ్మకముతో కూడిన అంగీకారము. విశ్వాసము అనునది అనుభవము వలన పొందవలసి ఉంటుంది.
మనం దేనికోసమైనా సరే విశ్వాసము ఆధారము గానే జీవించగలగాలి.అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయము అందగలదనే విశ్వాసము మనలో నిరంతరమూ ఉండాలి. విశ్వాసముతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలో ఉన్నప్పుడు అది ఆత్మ విశ్వాసము అవుతుంది.
శక్తి హీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారి తీస్తుంది. జ్ఞాన హీనమైన శక్తి గ్రుడ్డిదై వినాశనమునకు దారితీస్తుంది.అందుచేత మనం జ్ఞానం తో ప్రకృతి బంధాల నుండి విడుదల పొందాలి. ఆ తరువాత శక్తి అనుగ్రహముతో పరిపూర్ణతను సాధించాలి. శక్తికి జ్ఞానం నుండి అనుమతి లభించాలి.
సాంఖ్యమార్గములో చైతన్యాన్ని పురుషుడు అంటారు.కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు. క్రిందిస్థాయిలో వీటి మధ్య విరోధము ఉంటుంది. చైతన్యము అనేది కర్మ చేయదు. ప్రకృతికి జ్ఞానం లేదు. ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా వికలత్వము ఉన్నది.
చైతన్యము చూస్తే కుంటిది. ప్రకృతి చూస్తే గ్రుడ్డిది.లోకములో గ్రుడ్డితనం, కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబములో ఒక సోదరుడు గ్రుడ్డివాడు. ఒక సోదరుడు కుంటివాడు.చైతన్యము కుంటిది. ప్రకృతి గ్రుడ్డిది అనడానికి ఈ రెండూ ప్రతీకలే.
మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments