Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

నీకు తెలుసా?


నీకు తెలుసా? 

చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు, ముక్కు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ వేడి నీటి వినియోగం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా.వేడి నీటితో హాని ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? అవును, మితిమీరిన వేడి నీటిని అతిగా తాగడం ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. ఓ మెడికల్ సర్వే ప్రకారం.. అతిగా వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా సింగింగ్ ప్రొఫెషనల్సు వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 చర్మ కణజాలం దెబ్బతింటుంది.. 

ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే చర్మ కణజాలానికి హాని జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. 60 ఏళ్ల వృద్ధుడు వేడి నీటిని తాగడం వల్ల శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 నీటిలో లోహ కణాలు.. 

నీటిని వేడి చేయడం వలన అందులో లోహ కణాలు కలుస్తాయి. ఈ కణాలు వేడి నీటిలో త్వరగా కరిగిపోతాయి. అల్యూమినియం పాత్రలు, ఇతర పాత్రల్లో వేడి చేయడం వల్ల ఆ కణాలు నీటిలో కరిగి, శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే నీటిని ఎప్పుడూ ఉక్కు పాత్రలో వేడి చేసి తాగాలని నిపుణులు చెబుతున్నారు.

నీటిని వేడి చేసేటప్పుడు, త్రాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

1. బాగా వేడిగా ఉన్న నీటిని తాగొద్దు. దీని వల్ల గొంతు దెబ్బతింటుంది. నాలుక కాలే ప్రమాదం ఉంది.

2. వేడి నీళ్లలో చల్లటి నీళ్లు కూడా కలిపి తాగొద్దు. దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయి. అందుకే ఒకే రకమైన నీటిని తాగాలి.

3. నీటిని ఎక్కువగా మరిగిస్తే.. అవి గోరువెచ్చగా మారే వరకు వేచి చూడాలి. గోరు వెచ్చగా ఉన్న నీటినే తాగాలి.


Post a Comment

0 Comments