⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)
ధర్మపురి:-
యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. (మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)బ్రహ్మదేవుడు (సృష్టి)నరసింహుడు, (స్థితి)శివుడు, (లయం)యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది
కాళేశ్వరం:-
ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే..
వేములవాడ:-
అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)
మెదక్:-
సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది..
యాదగిరి:-
అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం..
కొండగట్టు:-
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం..
బాసర (వ్యాసపురి):-
వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం..
భద్రాచలం:-
శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం.
చెన్నూర్:-
గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం.
మంథని:-
మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహా ముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే.
బోదన్:
బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించ డానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.
మన ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం
latest news, employment news , govt orders, political comments, talent in all, movie clipping (Telegu and English) latest medical and market news, facts of culture, stock market, history of events tourism
0 Comments