శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు అంతర్ధానం అయిన తదుపరి కుక్కుటేశ్వర ఆలయములో దత్త దీక్షలను ఇచ్చు సన్యాసి ఎదుర్కొంటున్న విషయాలు గురించి తెలుసు కుంటూ ఉన్నాము.
ఉదకమును ధార పోయించుకున్న తదుపరి, అదృశ్యుడు అయ్యెను. ఇంతలో ఎవరో దీక్ష తీసుకున్న బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టినది గట్టిగా అరచెను. అతనికి తేలు మంత్రము వేయబడెను. తగ్గలేదు. రకరకములైన మంత్రములు జపించబడెను. కానీ ఏమీ గుణము కనిపించలేదు.
కుక్కుటేశ్వరస్వామి కి అభిషేకము, స్వయంభూదత్తునకు విశేష పరిణామంలో హారతి కర్పూరం వెలి గించబడెను. బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయేను. కానీ అతని నోటి నుండి నురగలు వచ్చుచుండెను. కరచినది తేలు కాదు పాము అని నిర్ధారించబడెను.
కమండలోదకము నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టి ఉండునని కొందరు అనిరి. పీఠికా పురమున ఏ క్షణమైనా, ఏ రకమైన వదంతులు పుట్టునో, వ్యాపించునో, ఆ వదంతులకు మూలమున ఎవరు ఏ రకమైన చిక్కుల్లో చిక్కుకుందురో ఆ దైవమునకు ఎరుక.
కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయించిననూ, స్వయంభూ దత్తునకు హారతి కర్పూరం వెలి గించిననూ కూడా ఆ బ్రాహ్మణునికి తేలు బాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణం ఆ దత్త దీక్షలను ఓసంగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానములో బొగ్గులు ఉండెను.
ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు కదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగెను.మరిన్ని విచిత్ర సన్నివేశములు గురించి రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments