Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో సుమతీ మహారాణి అన్ని బాకీలు తీర్చిపోవుచున్నానని అనుచున్నావు కానీ,  పైండా వారి, వత్సవాయి వారి, మల్లాది వారి పాల బాకీలను తీర్చలేవు అనిన మాటలకు,

శ్రీపాదుల వారు: తల్లిని ఉద్దేశించి, అమ్మా! నీవు అన్నమాటను నేను కాదనుట లేదు. 

ఈ మూడు వంశముల వారును నన్ను మరువక ఉండునంత కాలము నేను వారిని మరువక ఉండెదను.  నన్ను మరచిపోయిననూ వారికి నేను గుర్తు చేసెదను. హింసించి అయిననూ వారిచేత సేవ చేయించుకొని ఫలితము ఇచ్చెదను. 

నీ పుట్టింటి వారి ఇంట ప్రతీతరము నందునూ ఎవరో ఒకరి ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్లెదను. అయితే దక్షిణ తీసికొనను.  నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్యదృష్టితో తమ మేనల్లునిగా భావించెదరు అని నాకు తెలియును.  నేను కూడా ఈ మానవీయ సంబంధమును మన్నించుచూ బుద్ధిమంతుడైన మేనల్లునిగానే ప్రవర్తించెదను. 

ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలెను?  తండ్రిని ఉద్దేశించి, మన ఘండికోట వారి వంశము నందు వేదము చాలాకాలము వరకు నిలచి ఉండును. నా అన్నలిద్దరూ మంచి వేద పండితులు అయ్యదరు. ఘండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరువను. 

శ్రీధరశర్మ ఒకానొక జన్మమున సమర్థ రామదాసు అనెడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనెడి పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వం వహించును. ఈవిధముగా మన పౌరోహిత్య బంధము స్పష్టీకరణము గావించబడుచున్నది.  రామరాజశర్మ శ్రీధర నామమున జన్మించి మహాయోగి అగును. 

శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహాసంస్థానము ఏర్పడును.  పైండా వెంకటప్పయ్యశ్రేష్టిగారితో మనకున్న ఋణానుబంధము స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు. అని అభయం ఇచ్చిరి.

సావిత్రీపన్నము పఠించబడెను. శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణము. వేదపఠనం జరుగు చుండగా, అక్కడ ఉన్నవారు అందరూ చూచుచుండగా శ్రీపాదుల వారు అంతర్హితులు అయ్యిరి.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments