Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

క్రైస్తవ్యం ఎందుకు ఒక అబద్ధం!?

To get this information join our what's app group👇

https://chat.whatsapp.com/KgEl3bOTrN6...
క్రైస్తవ్యం ఎందుకు ఒక అబద్ధం!? ఒక మూఢనమ్మిక! ఎందుకు పాస్టర్లను సువార్తికులను క్రైస్తవులను అబద్ధమును ప్రచారం చేస్తున్న వారిగా ఈ ప్రపంచం పరిగణిస్తోంది?

నమ్మకము అంటే, ఒక్కదానికి ఆధారం లేకపోయినా కూడా అది సత్యము అని భావిస్తే దాన్ని మనము నమ్మకము అంటాము

మూఢనమ్మిక అంటే, ఒక నమ్మకానికి ఆధారం లేకపోవడమే కాకుండా, దానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారం ఉన్నా కూడా.. ఊహు, వ్యతిరేకంగా ఆధారం ఉన్నా సరే నేను మూర్ఖంగా నమ్ముతాను అని చెప్పడాన్ని మనం మూఢనమ్మకం ఉంటాం.
యేసు ఈ లోకానికి చెప్పిన శుభవార్త లేదా సువార్త ఏమిటంటే, ఈ లోకం అంతమగుచున్నది. సముద్రాలు పొంగి సూర్యచంద్రులు కాంతి విహీనమై, ఆకాశం నుంచి నక్షత్రాలు భూమి మీద రాలిపడి, ఆకాశ శక్తులు భూమిని పెకలించి అంతము కావించునున్నది. దీనిని నుండి తప్పించు కోవడానికి పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము మనుష్య కుమారుని ద్వారా లేదా యేసు యొక్క రెండో రాకడ ద్వారా భూమి మీదకు రాబోవుచున్నది, బాప్తిస్మము తీసుకొని అందులో ప్రవేశించి శాశ్వతంగా రక్షించబడటమే సువార్త అని ప్రకటించాడు.
యేసు ఇలా జరుగుతుందని నమ్మాడు. ప్రజలకు కూడా చెప్పాడు అందులో కొందరు నమ్మారు. అక్కడ ఆ ప్రజలు యేసు సందేశాన్ని నమ్మడం ఎన్నో మానవ మత నమ్మకాల లాగే అదీ ఒక నమ్మిక అవుతుంది తప్ప అది ఎటు పరిస్థితిలో మూఢనమ్మకం కాదు.
అయితే, ఆ యేసు సందేశాన్ని మనము నేడు నమ్మితే అది కచ్చితంగా మూఢనమ్మకం అవుతుంది. ఎందుకంటే యేసు ఆ అంతము, ఆ పరలోక రాజ్యము రావడం, వారి తరములోనే జరుగు తీరు తుందని చెప్పాడు. వారిలో కొందరు మరణం రుచి చూడకముందే మనుష్యకుమారుడి రాక దేవుని రాజ్యం తేక, తీర్పుదినం జరుగుతాయని, యేసు నిశ్చయముగా చెప్తున్నాను అని కచ్చితంగా చెప్పాడు.
ఆ తరము గతించక ముందు అప్పటి వారు మరణం రుచి చూడనంతవరకు అది ఒక నమ్మకం గానే ఉంటుంది. అయితే ఆ తరము గతించిపోయి అప్పటి వారందరూ మరణించి దాని తరువాత కూడా అనేక తరములు గతించిపోతే, యేసు చెప్పిన మాటలు ఉత్తమాటలే అని తేలిపోయాక, నిరూపణ అయ్యాక కూడా, తర్వాత కాలం వారు నమ్మితే, ఆ నమ్మకాన్ని మనం మూఢనమ్మకం అంటాం.
ఇంతకు మనుష్య కుమారుని రాక లేదా తన రెండో రాకడ ఆ కాలంలోనే జరుగుతుందని చెప్పాడా లేడా, బైబిల్ నుంచి చూద్దాం దానితోపాటు ఆయన శిష్యులు కూడా ఏమని ప్రకటించారు ఏమని వాళ్లు రాసిన లేఖలో ప్రచారం చేశారు యేసు ఎప్పుడు వస్తాడని రాశారు అని ఒకసారి చూద్దాం.
రెండవ రాకడ (మరియు ప్రపంచం అంతం) తన సమకాలీన తరంలో ఉంటుందని యేసు నిశ్చయముగా చెప్పాడు.
పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించు నప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి;
మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 10:7‭, ‬23
[దేవుని రాజ్యం దగ్గర్లోనే ఉంది అనే సువార్తను ప్రకటించండి మీరు ఇజ్రాయిల్ దేశంలోని పట్టణాలలో ప్రకటించండి అని చెబుతూ అయితే, నేను వచ్చే లోపల ఈ చిన్ని ఇజ్రాయిల్ దేశం లోని పట్టణాలన్నీ కూడా మీరు కవర్ చేసి ఉండలేరు అంత త్వరగా వస్తాను అని చెప్తున్నాడు]
ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 16:28
[ఆ కాలంలో ఆనాడు ఆయన ప్రసంగం వింటున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని కచ్చితంగా చెబుతా ఉన్నాను అని చెబుతున్నాడు]

మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
మత్తయి 24:32‭-‬35
[సముద్రాలు పోటెత్తుట చంద్రుడు సూర్యుడు కాంతి విహీనమైన పోవుట ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుట భూమి నశించి పోవుట ఇవన్నీ కూడా జరిగే వరకు ఈ జనరేషన్ లేదా ఈ తరం గతించదు అంటున్నాడు ఆకాశమే భూమే గతించిపోయిన తన మాట గతించదు అని స్పష్టం చేస్తున్నాడు ఇదే విషయాన్ని ఈ క్రింద వచనాలు వేరు వేరు సువార్తలలో రాసుకువచ్చారు]
ఆయన (యేసు) – ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
మార్కు 9:1
ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలు దిక్కుల నుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును. అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.

మార్కు
13:24‭-‬31
ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

లూకా 9:27
మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తి కొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా? అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.

లూకా
21:25‭-‬33
మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను 5:25
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును;

యోహాను 12:31
పౌలు కూడా ఇలాగే చెప్పాడు. పౌలు స్పష్టంగా, ఏసు రెండో రాకడగా వచ్చువరకు, తాను తన సహచరులు మరణించము అని సజీవులుగా ఆకాశమద్యములో వస్తున్న యేసుకు ఎదురెళ్తామని ప్రకటించాడు. మేము ప్రభువుమాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనమునిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనమువారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభు వు తోకూడ ఉందుము.

1 థెస్సలొనీకయులకు
4:15‭, ‬17
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
1 కొరింథీయులకు
15:51‭-‬52
♦️ లేఖలు అంటే ఏంటి? ఈత యొక్క బయోగ్రఫీ లేదా బోధనలతో కూడిన జీవితచరిత్రను సువార్త పుస్తకాలుగా రాశారు. ఆయన తరువాత ఆయన శిష్యులు అపోస్తులులు ఆనాటి సంఘాలకు/చర్చిలకు ఆనాటి ప్రజలకు రాసినటువంటి పత్రికలను లేఖలు అన్నారు. ఆనాటి ప్రజలతో ఆనాటి ఏసు శిష్యులు ఏమని లేఖలో రాశారో ఈ క్రింది వచనాల ద్వారా మనకు రూఢీ అవుతుంది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.

హెబ్రీయులకు 1:2
ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చు చున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.

హెబ్రీయులకు 10:37
ఆయన (యేసు) యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాప నివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.
హెబ్రీయులకు 9:26
సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును
1 కొరింథీయులకు 7:29
చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకు లైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొను చున్నాము.
1 యోహాను
2:18
ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి.

యాకోబు 5:8
అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
1 పేతురు 4:7
ఇవన్నీ కూడా ఆ కాలం ప్రజలతో ఆ కాలంనాటి శిష్యులు చెప్పిన మాటలు. ఇది ఈ కాలంనాటికీ ప్రపంచం అందరికీ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇది ఫలానా వారికి రాస్తున్న పత్రిక అని అందులోనే ఉంటుంది.
యుసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు ♦️త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ♦️సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
ప్రకటన 1:1‭, ‬3
నేను(యేసు) త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
ప్రకటన 3:11
సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను,
ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను;

ప్రకటన 22:6‭-‬12
లూకా మాత్రమే "అంత్యం అంతం కాదు" (లూకా 21:9, 19:11) అని చెప్పాడు. మీరు యుద్ధములను గూర్చియు కలహములనుగూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసి యున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.
లూకా 21:9
👉వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉప మానము చెప్పెను. ఏమనగా,

లూకా
19:11
యోవేలు కూడా ఇదే చెప్పాడు (4వ శతాబ్దము. B.C.E) అప్పుడు కూడా తీర్పు దినం "సమీపంలో ఉందని" ప్రకటించాడు (యోవేలు 3:14, 2:1). తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
యోవేలు 3:14
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక.
యోవేలు 2:1
కాబట్టి ఏసు ఆనాడు స్పష్టంగా అతి త్వరలోనే అంతము ఉంది. తీర్పు దినము ఉంది. తీర్పు తీర్చు మనుష్య కుమారుని రాకడ లేదా తన రెండో రాకడ ఉంటుందని యేసు బోధించాడు. అనేక చోట్ల స్పష్టంగా ఈ తరం గతింపకముందే నా మాటలు వింటున్నటువంటి మీలో కొందరు మరణించక ముందే నేను వస్తాను ఈ తీర్పు దినం జరుగుతుంది అని ఏసు చెప్పాడు దానినే వారి శిష్యులు కూడా ప్రచారం చేశారు ఇవన్నీ సువార్తలలో యేసు శిష్యులు రాసిన ఆనాటి లేఖలలో స్పష్టంగా ఉంది.

Post a Comment

0 Comments