Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

                                                                    ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు పీఠికాపురంలో చెప్పిన విధముగా వైశ్య ప్రముఖుడు ధనగుప్తుడు చేయ నిశ్చయించుకొనెను.

ధర్మగుప్తుల వారి వద్దగాని, శంకరభట్టు వద్ద కానీ, రోక్ఖము ఏమియూ లేదు. అందరూ కొండవీడును చేరిరి.   కొండవీడు నందు వైశ్య ప్రముఖుడు అయిన ధనగుప్తుల వారి కుమారుని వివాహము వైభవముగా జరిగినది. శంకరభట్టుకు 11 వరహాలు ధనగుప్తుల వారొసంగిరి. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు.

ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహమునకు ఆహ్వానింపబడెను. ధర్మగుప్తుల వారు ఎక్కడ ఉన్నది, ఎప్పుడు రాబోవునది ఎవరికీ తెలియదు.  ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబసభ్యులు కూడా విచ్చేసిరి. ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా వివాహమునకు వచ్చెను.

కొండవీడు నందు ధర్మగుప్తుల వారి కుమారునకు, ధనగుప్తుల వారి కుమార్తెకు వారి వివాహము జరుపుటకు నిశ్చయతాంబూలాలు జరిగెను.  అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న శంకరభట్టుకు 11 వరహాలు లభించెను.  అప్పటి వరకూ నిర్ధనుడుగా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయతాంబూలాల సమయమున నూరు వరహాలు లభించెను.

ఆహా! ఏమి ఈ విచిత్ర ఘటనాక్రమము.  ధర్మగుప్తుల వారికి అచ్చట వజ్రముల వ్యాపారమునకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయము ఏర్పడెను. దానికి సంబంధించిన క్రయ విక్రయ ములు లావాదేవీలను ఖరారు చేసుకొనుటకు గాను వారు కొండవీడున కొంతకాలము ఉండ దలచిరి.  కొండవీడు నందు దత్తప్రభువులు ప్రశ్చన్నముగా తిరుగుచుండెదరు అని ప్రతీతి.

అచ్చట లంబికాయోగులు, శివయోగులు, స్వర్ణవిద్య తెలిసినవారు కూడా కలరట.  శంకరభట్టును మాత్రము గుఱ్ఱపుబండిలో విజయవాటికకు చేర్చుటకు నిర్ణయించిరి.

మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాము.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు 

 

Post a Comment

0 Comments