Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు

 మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు   

     ఈ  సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం.  ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.

విరుద్ద ఆహారపదార్థాలు - 

*  నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.

*  తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 

*  ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 

*  కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.

*  చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.

*  చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 

*  పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 

*  ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 

* ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.

*  మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .

*  మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.

*  ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .

*  ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.

*  పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.

*  పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .

*  తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 

*  ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.

*  నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.

*  ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.

* తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 

*  రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.

* బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 

*  అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 

    పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును.

పడిశం పట్టి (జలుబు చేసి) ముక్కులు మూసుకుపోయినప్పుడు ఉపశమనం కోసం ఆట్రివిన్, నేసీవియాన్ వంటి స్ప్రేలు వాడటం ద్వారా దీర్ఘకాలంలో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?వైద్య నిలయం సలహాలు అవగాహనా కోసం

జలుబు చేసినప్పుడు మూసుకుపోయే నాసిక రంధ్రాలను తెరవడానికి మెదడు అనుక్షణం పోరాడుతూనే ఉంటుంది. శరీరంలోని చాలా కణాలను సైన్యంగా మార్చి జలుబుపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అందుకే, మీరు గమనించినట్లైతే జలుబు చేసిన సమయంలో మనకు మామూలు సమయాల్లో కంటే ఎక్కువగా ఆకలి, దాహం వేస్తాయి. కారణం ఆ యుద్ధమే. ఇలాంటి స్ప్రేలు అలవాటు చేసుకోవడం వల్ల ఆ యుద్ధాన్ని మెదడు విరమిస్తుంది. తద్వారా, అవి వాడితే తప్ప నాసిక రంధ్రాలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వాటికి మనం బానిసలయ్యే ప్రమాదముంది. అందుకే, వాటిని ఎక్కువగా వాడకూడదు. గట్టిగా చెప్పాలంటే అసలు వాడనేకూడదు. వాటి అవసరమూ లేదు.

జలుబు నుండి ఉపశమనం కోసం ఆది నుండీ పాటించే నవీన్ రోయ్ సలహాలు ఉత్తమం.

1.లంకణం పరమౌషధం’ అని ఒక నానుడి ఉంది. అది జలుబుకి బలమైన ప్రత్యర్థి. జలుబు చేసిన రోజు రాత్రి ఘన పదార్థాలేమీ పుచ్చుకోకుండా పడుకుంటే మరుసటి రోజు ఉదయం కల్లా ఉపశమనం లభించడమే కాక ఆ రాత్రి గాఢ నిద్ర పట్టడం వల్ల నూతనోత్సాహం లభిస్తుంది శరీరానికి. పరకడుపుతో కాక పళ్ళరసాలు పుచ్చుకొని పడుకోవచ్చు. విటమిన్ సీ లేదా సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉన్నవి పుచ్చుకుంటే మరీ మంచిది.

2.ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తున్నారు) పసి పిల్లలకు జలుబు చేస్తే పెద్దలు వాళ్ళని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని వేడినీళ్ళతో తలంటు పోసేవారు. అప్పుడు దోసిలితో నీళ్ళు తీసుకొని తలపైన బలంగా కొడతారు. దాంతో నాసిక రంధ్రాలు తెరుచుకొని వారికి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా పెద్దలకు కూడా పనికొస్తుంది. ఇప్పుడ అందరి ఇళ్ళలో బాత్రూములో వాటర్ హీటర్లు సహజం కాబట్టి షవరు క్రింద వేడినీళ్ళతో స్నానం చేస్తే యిట్టే ఉపశమనం లభిస్తుంది.

3.వేడి పాలలో పసుపు కలుపుకొని త్రాగినా మంచిదే.

4.మరిగే నీళ్ళలో పసుపు వేసుకుని దుప్పటి కప్పుకుని ఆ ఆవిరి పీల్చినా మంచిదే.

5.త్రిఫల చూర్ణం తీసుకున్నా మంచిదే.

జలుబుకి ఎటువంటి మందులూ అవసరం లేదు. ఈ చిట్కాలన్నీ నేను పరిశోధించి, తరచూ పాటించి లాభం పొందిన స్వానుభవంతో చెప్పినవి. ఎందుకంటే, నాకు dust allergy ఉండడం మూలాన జలుబు నిత్యం నా వెంట నడిచే నా ప్రియమైన శత్రువు.  

 (సేకరణ మీ నవీన్ నడిమింటి)

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group

ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

Post a Comment

0 Comments