Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

బ్రాహ్మణులకు లబ్ది చేకుర్చుతున్న ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం

 బ్రాహ్మణులకు లబ్ది చేకు ర్చుతున్న ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం

బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా.గత ప్రభుత్వంలో పథకాల అమలు కోసం ఐదేళ్లలో రూ.216 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.640 కోట్లు ఖర్చు చేసింది. అంటే 3 రెట్లు ఎక్కువ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కోసం రూ.80 కోట్ల నిధులు కేటాయించారు
గత ప్రభుత్వంలో అనగా చంద్రబాబు ప్రభుత్వం ‘కశ్యప పెన్షన్‌ పథకం‘ ద్వారా కేవలం 16,295 మంది వృద్ధ బ్రాహ్మణులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్లు అందిస్తే, ఈ ప్రభుత్వం 48,448 మంది బ్రాహ్మణులకు నెలకు రూ.2,750 చొప్పున ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ ద్వారా పెన్షన్లు అందిస్తోంది.
గత ప్రభుత్వంలో ‘భారతీ విద్యా పథకం’ ద్వారా సుమారు 22 వేల మంది బ్రాహ్మణ విద్యార్థులకు కేవలం రూ.5 వేలు, రూ.7 వేలు, రూ.10 వేల వరకు అందజేస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ‘జగనన్న అమ్మ ఒడి‘ ద్వారా 22,120 మందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తోంది.
‘జగనన్న విద్యాదీవెన‘ ద్వారా 7,087 మందికి రూ.22.29 కోట్లు, ‘జగనన్న వసతి దీవెన‘ ద్వారా 5,082 మందికి రూ.7.63 కోట్ల ఉపకార వేతనాలు 2022–23 విద్యాసంవత్సరంలో అందజేశారు. ఈ సంవత్సరంలో 2023–24 లో ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన కింద రూ.26.38 కోట్లు 17,581 మంది బ్రాహ్మణ విద్యార్థులకు అందజేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.6.30 కోట్లు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్థికంగా అందించింది.
వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 10,053 మంది బ్రాహ్మణ మహిళా డ్వాక్రా సభ్యులకు గత మూడు సంవత్సరాల్లో రూ.44.84 కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఈ నాలుగు సంవత్సరాల్లో రూ.2.01 కోట్లు, జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.123.10 లక్షలు, జగనన్న తోడు ద్వారా రూ.13.9 లక్షలు బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చింది.
బ్రాహ్మణ మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా గత సంవత్సరంలో రూ.33.43 కోట్లు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున 22,305 మందికి లబ్ధి చేకూర్చింది. ఈ సంవత్సరంలో 24,592 మందికి రూ.36.88 కోట్లు ఆర్థిక సహాయం అందజేసింది.
గరుడ పథకం ద్వారా మరణించిన బ్రాహ్మణుల అంత్యక్రియలకు 2019–20 సంవత్సరంలో 844 మందికి రూ.84.40 లక్షలు, 2020–21 సంవత్సరంలో 537 మందికి రూ.53.70 లక్షలు, 2012 సంవత్సరంలో 390 మందికి రూ.39 లక్షల ఆర్థిక సహాయం చేసింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 340 మందికి వారి వారసులకు రూ.34 లక్షలు మార్చి నెలలో అందజేసింది.
ప్రస్తుతం బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకి జగనన్న ‘విదేశీ విద్య పథకం’ అమలు చేస్తోంది. 2019–20 సంవత్సరానికి సంబంధించి 96 మంది విద్యార్థులకు రూ.9.40 కోట్లు విజిలెన్స్‌ విచారణలో ఉన్నది. విజిలెన్స్‌ విచారణ అనంతరం విదేశీ విద్య సహాయం అందజేస్తుంది
చాణక్య ఔత్సాహిక పథకంలో 2016–17 నుంచి 2018–19 వరకు అనర్హులకు లబ్ధి చేకూర్చారు. ఎటువంటి గ్రౌండింగ్‌ ఆఫ్‌ యూనిట్లు లేకుండా కేవలం సిఫార్సులకు పరిమితమై అప్పటి చైర్మన్‌ అవినీతికి పాల్పడ్డారు.
పోటీ పరీక్షల శిక్షణను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద అతి తక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు చేస్తే.. ఈ ప్రభుత్వం అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టింది.
బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాత్రమే కాకుండా దేవదాయ ధర్మదాయ శాఖ ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2,322 మంది అర్చకులకు కనీస వేతనం అర్బన్‌లో రూ.15 వేలు, రూరల్‌లో రూ.10 వేల చొప్పున చెల్లించి రూ.24.11 కోట్లు ఖర్చు చేసింది.
4,681 మంది అర్చకులకు వేతనాలు, పడితరం కోసం ధూపదీప నైవేద్యం పథకంలో రూ.28.86 కోట్లు ఖర్చు చేసింది. అర్చక సంక్షేమ నిధి ద్వారా వివిధ పథకాల కింద అర్చకుల సంక్షేమ కోసం రూ.44.33 కోట్లు ఖర్చు చేసింది.
మేనిఫెస్టో హామీ మేరకు అర్చకులకు 65 ఏళ్ల పదవీ విరమణ వయస్సును నిబంధనను తొలగించింది. కరోనా సమయంలో 35 వేల మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున రూ.17.50 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న ‘బ్రాహ్మణ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ‘ ద్వారా బ్రాహ్మణులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రుణాలు మంజూరు చేస్తోంది. 2019–20 సంవత్సరంలో రూ.14.36 కోట్లు, 2020–21లో రూ.30.28 కోట్లు, 2021–22లో రూ.38.72 కోట్లు, 2022–23లో రూ.52 కోట్ల రుణాలు మంజూరు చేసింది. బ్రాహ్మణ మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారత లోన్లు, బ్రాహ్మణ పురుషుల స్వయం ఉపాధి కోసం రూ.45 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సూక్ష్మ రుణాలు మంజూరు చేస్తోంది. అర్చకులకు అర్చకమిత్ర పథకం ద్వారా 309 మందికి రూ.14.02 కోట్లు, 4,188 మంది పురోహితులకు పురోహమిత్ర పథకం ద్వారా రూ.19.63 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి 712 మందికి రూ.15 కోట్లు రుణాలు మంజూరు చేసింది.
గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కేవలం 47,500 మంది బ్రాహ్మణులకు రూ.216.75 కోట్ల లబ్ధి చేకూరితే, ప్రస్తుత ప్రభుత్వంలో 1,22,791 మంది బ్రాహ్మణ కుటుంబాలకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా మూడింతల రూ.640.29 కోట్లు వివిధ పథకాలల ద్వారా లబ్ధి చేకూరింది

(సేకరణ)

Post a Comment

0 Comments