Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

 కోవిడ్ మృతులకుటుంబాలకుఆర్థిక సాయం

 

:        కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయా కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు సాయం అందజేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నియమ నిబంధనల్ని ఆ ప్రకటనల్లో స్పష్టం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ లో దరఖాస్తు సమర్పించాలి. ఎమ్మార్వో వాటిని పరిశీలించాక సదరు దరఖాస్తు కలెక్టరేట్ లోని డీఆర్‌వో విభా గానికి పంపింస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ - (గ్రామ వార్డు అభివృద్ధి) కార్యాలయ విభాగంలో ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆ నివేదికను సమగ్రంగా పరిశీలించి మృతుల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున సాయం అంద జేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభు త్వం నుంచి పీఎంజీకేవీవై పథకం ద్వారా గానీ, ఏపీ ప్రభుత్వం నుంచి కోవిడ్ మృతులకు అందే పరిహారం కింద గానీ రూ.10లక్షలందుకున్న కుటుంబాలకు ఈ పథకానికి అనర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. తక్షణమే దరఖాస్తుల స్వీకరణ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును ఈ నెల 8వ తేదీగా నిర్ణయించారు.


        సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు విషయాన్ని అం దరికీ తెలియజేసి, దరఖాస్తుల్ని ఆయా తహసీల్దార్ కార్యాల యాలకు అందజేసే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.


            ఈ పథకం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిఅనిల్ సింఘాలు తగిన ఆదేశాలు జారీ చేశారు. దరఖా స్తుదారులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలు కరోనాతో మృతి చెందిన వ్యక్తి ఆధార్ కార్డు జిరాక్స్ - మొబైల్ నెంబర్ + కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ - డెత్ సర్టిఫికెట్ - కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ - దరఖాస్తుదారుని ఆధార్ జిరాక్స్/మొబైల్ నంబర్ - రైస్ కార్డు జిరాక్స్ తెల్లకాగితంపై అర్టీ | సదరు వ్యక్తి కోవిడ్ కారణంగానే మృతి చెందారని ధృవీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ - బ్యాంకు ఖాతా నంబర్, వివరాలు - ఆశా సంతకం (పేరు, ఆధార్, మొబైల్ నెంబర్)

Post a Comment

0 Comments