Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీ సిహెచ్ బాబూరావు కన్వీనర్ ఆంధ్ర ప్రదేశ్ పట్టాన పౌర సమాఖ్య

 

శ్రీ సిహెచ్ బాబూరావు కన్వీనర్ ఆంధ్ర ప్రదేశ్ పట్టణ  పౌర సమాఖ్య  (APUCF) నుండి సందేశం. ఈ సందేశం విస్తృతంగా మీకు తెలిసినవారికి చేరవేయండి 

    ఆస్తి విలువ ఆధారిత ఆస్తిపన్ను (ఇంటి పన్ను)విధానాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసినరిట్ పిటిషన్ విచారణ నవంబర్ 30వ తేదీకి వాయిదా

    హైకోర్టులో సమాధానాలు (కౌంటర్)దాఖలు చేయకుండా జాప్యం,మరోవైపు ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను నోటీసులు జారీచేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం

     హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నోటీసుల పంపిణీ నిలిపివేయాలి.పన్నుల పెంపు ఆపాలి

                                                                  - సిహెచ్. బాబూరావు 
                                                                    కన్వీనర్ ,ఆంధ్రప్రదేశ్ పట్టణపౌర సమాఖ్య (APUCF)

                      

     ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను( ఇంటి పన్ను)విధానాన్ని రద్దు చేయాలని , విలువ ఆధారిత పన్నువిధింపు పై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణలు, జిఓ 198 లను సవాల్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక, ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య నిర్ణయం మేరకు  టాక్స్ పేయర్స్ అసోసియేషన్, విజయవాడ తరుపున సెప్టెంబర్ 14 వ తేదీన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది( కేసు నెంబర్ -21686 /2021)

         హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వము ,మున్సిపల్ శా ఖలను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోరింది. ఈ కేసు నిర్దేశించిన గడువు ప్రకారం నవంబర్ 23 వ తేదీన డివిజన్ బెంచ్ ముందుకువచ్చింది..  8 వారాలు గడిచినా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయకపోవడం గర్హనీయం.  మరోవైపు రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలు,మున్సిపాలిటీలు ఆస్తిపన్ను పెంచుతూ, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని అమలు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు.

         హైకోర్టు కౌంటర్ దాఖలు చేయకుండా, విచారణ  జరుగుతుండగా పన్ను పెంపుకు పూనుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఇప్పటికైనా ప్రభుత్వం, మున్సిపల్ శాఖలు, పట్టణ స్థానిక సంస్థలు నోటీసులు పంపిణీ నిలిపివేయాలి. హైకోర్టులో విచారణపూర్తయి ,తగు ఆదేశాలు ఇచ్చేవరకు ఆస్తి విలువఆధారిత ఇంటి పన్ను విధానం అమలు నిలిపివేయాలి .ఆస్తిపన్ను పెంచకుండా ఆపాలి. లేనియెడల న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం తప్పదు .

        ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించిప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని, సహజ న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకొని ఇంటి పన్నుల పెంపు ప్రక్రియ పూర్తిగా నిలిపివేయాలి. 

         ఈ రిట్ పిటిషన్ పై నవంబర్ 30 వ తేదీనవిచారణ జరగనున్నది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా ,హైకోర్టు న్యాయమూర్తి  జస్టీస్ శ్రీ సత్యనారాయణ మూర్తి గారి తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తుంది . ప్రముఖ న్యాయవాది శ్రీ సుంకర రాజేంద్రప్రసాద్ గారు పిటిషనర్ తరఫున ఈ కేసు ఫైల్  చేశారు. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు, శ్రీ నర్రా శ్రీనివాస్ గారు ఈ కేసుకు న్యాయవాదులుగా ఉన్నారు.


                                                                        -సిహెచ్ బాబూరావు
                                                                          కన్వీనర్ ,ఆంధ్రప్రదేశ్ పట్టణపౌర సమాఖ్య
                                                                          ( ఏపీ అర్బన్ సిటిజన్స్ ఫెడరేషన్,)
                                                                          ( APUCF)


Post a Comment

0 Comments