రక్త హీనం శక్తీ హీనం
భారతీయ మహిళను వేధి స్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఎనీ మియా. రక్తహీన తను అనారోగ్యంగా పరిగణించకుండా అజాగ్రత్తగా రోజులు గడిపేస్తుంటారు కూడా. నిజానికి ఇది అనేక రకాలుగా ప్రాణాపాయానికి కారణమవుతుం దని గమనించాలి. ఎప్పుడూ అలసటగా అనిపిం చడం, చర్మం నిర్జీవంగా, తెల్లగా పాలిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, నిస్సత్తువ, గుండె వేగం ఉన్నట్లుండి పెరిగిపోవడం, శ్వాస దీర్ఘంగా తీసుకోలేకపోవడం, దేని మీదా ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉండడం ఇవన్నీ రక్త హీనత కారణంగా కనిపించే ప్రధాన లక్ష ణాలు.
రక్తహీనత ఉన్నప్పుడు దేహంలోతర చుగా అంటువ్యాధులు దాడి చేస్తుంటాయి. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం. ఐరన్ లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసు కోవాలి.
'సి' విటమిన్ ఉన్న ఆహారం తీసుకో వాలి. నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు వ్యాధినిరోధక శక్తినిపెంచుతాయి. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయ పులిహోర వంటి వంట కాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి. సీ విటమిన్ తగినంత లేకపోతే ఆహారంలో తీసు కున్న ఐరన్ను దేహం గ్రహించలేదు. కాబట్టి ఆకు కూరల్లో నిమ్మ రసం కలుపుకుని తినడం మంచిది.
రక్తహీనతతోపాటు కఫం తో కూడిన దగ్గు కూడా ఉంటే రోజూ ఉదయం సాయంత్రం కప్పు పెరుగును టీ స్పూన్ స్వచ్చమైన పసుపుతో కలిపి తీసుకోవచ్చు.
దానిమ్మ, బీట్ రూట్లు రక్తవృద్ధి తోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి.
నువ్వులను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవాలి. నువ్వులను రెండు-మూడు గంటల సేపు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో తేనె కలుపుకుని తినవచ్చు
నువ్వులు- బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలు పకోవచ్చు. • రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు తింటే చాలు. రక్తహీనత నుంచి సులువుగా బయట పడవచ్చు.
0 Comments