Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీవల్లభ చరితామృతము

 


ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో ఇంత  వరకూ నవనాధుల గురించి స్వామివారు తెలియ జేశారు.

శంకరభట్టు: గురుసార్వభౌములకు జయము! జయము! నవనాధుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములని అంటిరి. నవకృష్ణులకు, నవనాధులకు వ్యత్యాసము ఉన్నదా ప్రభూ!?

శ్రీపాదుల వారు: చిరుమందహాసం తో స్వామి వారు శంకరభట్టు, ధర్మగుప్తుల వంక దివ్యప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి.

నాయనలారా! సమస్త సృష్టి యొక్క మహాసంకల్పస్వరూపమును నేనే! సమస్త దేవీదేవతలకు వచ్చెడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పము యొక్క అంశమాత్ర సంకల్పములు.ఈ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రము స్వతంత్రముండును.

ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవాటి త్రాటితో బంధించును. అనగా, ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు.ఆ పరిమితులకు లోబడి అది మేయవచ్చును. అనగా, దానికి ఈయబడిన పరిమితమైన స్వేచ్చ. దానికి యీయ బడిన స్వేచ్ఛాప్రదేశము నందు తనకు ఇచ్చ వచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును.ఆ పరిధులను దాటి మేత మేయవలెను అన్న, పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను.

అచ్చట మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరు చోట చెట్టునకు కట్టివేయుటయో లేక అదే చెట్టునకు కట్టిననూ తాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదే విధముగా, కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్చ ఈయబడును.అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఈయబడును. 

ఏదయినా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు, మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి, జీవులకు శ్రేయస్సును కలిగించెదరు.మానవులకు ఉండునట్లు రాగద్వేషములు, అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవుట వలన, 

మూలతత్వము ఏ యే కార్యములను చేయ సమర్థమగుచుండునో, అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును.అందువలన జీవులకు సంబంధించినంత వరకూ, అంశావతారముగా వచ్చినా, పూర్ణావతారముగా వచ్చినా, వ్యత్యాసము ఏమియూ ఉండదు. 

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments