Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము


ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ

శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో నరసింహరాయుడు తన వృత్తాంతమును శంకరభట్టు, ధర్మగుప్తుల వారికి తెలియజేస్తూఉన్నాడు.

ఒకానొక రాత్రి సమయమున ఆ దొంగసాధువు మా రమణిని సమీపించెను. ఆమె వశీకరణంనకు లోనయి ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించెను.అతడు తనను సమీపించగానే మా రమణి బిగ్గరగా అరచి మహా భయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకొని అతని తలపై బాదెను.ఆమె ఆ విధముగా ఎందుకు చేసెనో ఆమెకు తెలియదు. తన వశీకరణమున ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఏల ఈ విధముగా ప్రవర్తించెనో దొంగసాధువుకు తెలియదాయెను. 

తెల్లవారిన పిదప ఒక బీద బ్రాహ్మణు యాచకుడు మా ఇంటికి వచ్చెను. మా రమణి ఇంటి బయిటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచాలు చాలా ఉన్నవనియు, మీకు కావలెనన్న వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియు చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. అతని వదనారవిందము ప్రశాంతముగను, ఉజ్వలముగాను ఉండెను. ఇంతలో మా మేనమామ బయిటకు వచ్చెను. అయ్యా! మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నవి. నీకు కావలెనన్న ఆ పరిస్థితులను సృష్టించెడి దుష్టశక్తులను దానంగా గైకొనవచ్చును.

ఇంతలో మా మేనత్త వచ్చెను. భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమియో లేదు. మా ఇంటనున్న దరిద్రమును నీవు కావలెనన్న భిక్షగా స్వీకరింపుము అనెను.  నేను కూడా ఇంటిలో ఉంటిని. స్వామీ! నా వద్ద మా తాతముత్తాతలు కాలము నుండి వచ్చుచున్న వెండితాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతము అయిన యెడల దానిని భిక్షగా స్వీకరించవచ్చును. నేను వెండితాయెత్తును భిక్షగా ఇచ్చితిని. 

ఇంతలో దొంగసాధువు అప్పుడే శ్మశానం నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను. అతడు వెటకారంగా, ఓయీ! బడుగుబాపడా! నీవు వలయునన్నచో ఈ మానవ కపాలములను భిక్షాగా స్వీకరించవచ్చును అనెను. అతడు స్వీకరించ మిచ్చుననెను. అతడు వల్లెయనెను.

అంతలో మా ఇంటిలో దివ్యప్రకాశము ఒకటి కానారానయ్యెను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడు అయ్యెను.  ఆ దివ్యప్రకాశము వలన దొంగసాధువునకు ఒళ్ళంతయు మంటలు కలుగ నారంభించెను.ఆ ప్రకాశము నందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించెను. ఆమె స్వస్థురాలు అయ్యెను. మా మేనత్తకు పక్షవాతం వచ్చి మాట పడిపోయెను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను.  నాకు విపరీతమైన ధైర్యము కలిగెను. నా శరీరములో ఏదో నూతనశక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది. మాంత్రికుని నోటి నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులు ఉడిగిపోయెను.

ఆ దివ్యప్రకాశము మానవరూపమును ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడు, సమస్తదేవీదేవతా స్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడు అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. రేపు నరసింహరాయునకు  శ్రీపాదుల వారు తెలియజేసిన కొన్ని విషయాలు తెలుసుకుందాము.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments