Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

  శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము


ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు శ్రీదేవీతత్వము దశమహావిద్యారూపముగా ఏ విధముగా ఉపాసింప బడుచున్నది తెలియజేస్తూఉన్నారు.

శ్రీపాదుల వారు: *దశ మహావిద్యలలో రెండవ రూపము తార.* ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది. తరింపచేయునది. కావున తారా నామము విశ్వవిఖ్యాతమైనది.  ఈమెను నీల సరస్వతీ నామమున కూడా పిలిచెదరు.   భయంకరమైన విపత్తుల నుండి భక్తులను రక్షించునది కావున ఈమెను ఉగ్రతారారూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ట మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. 

చైత్ర శుద్ధ నవమి రాత్రిని తారా రాత్రి అని పిలిచెదరు. దశ మహా విద్యలలో *మూడవ రూపము చిన్నమస్త.* ఇది అత్యంత గోపనీయమైనది.  దేవి ఒకానొక పర్యాయము తన సఖురాండ్రు అయిన జయవిజయలతో మందాకినీ నదికి స్నానార్థము వెడలినది.  స్నానము అనంతరము ఆమె క్షుదాగ్ని పీడితయై కృష్ణవర్ణ అయినది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజనము విషయమై అడిగిరి. 

కృపామయురాలు అయిన దేవి, ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా, ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది.  ఆమె కబంధము నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా, మూడవ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. 

ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది.  హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవీ ఉపాసకులే. దశమహావిద్యలలో *నాల్గవ రూపము షోడశీమహేశ్వరి.* ఈమె హృదయము దయాప్రపూర్ణము. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనునది కరతలామలకము.
విశ్వములోని మంత్రతంత్రాదులన్ని, ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి.

ఈమెను వేదములు కూడా వర్ణించజాలవు.ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభిష్టాలు నెరవేరుస్తుంది.ఈ భగవతీ ఉపాసన వలన భోగమొక్షములు రెండూ సిద్ధిస్తాయి.  దశమహావిద్యలలో *ఐదవ రూపము భువనేశ్వరీదేవి.* సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి.  కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులు ఉన్నాయి. వాటినుండి అవ్యక్త భువనేశ్వరీ వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించ గలుగుతుంది.

ప్రళయవేళలో కమల నుండీ అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీరూపములో మూలప్రకృతిగా మారుతుంది.  అందుచేతనే ఈమెను కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు.
దశమహావిద్యలలో *ఆరవ రూపము త్రిపురభైరవి.* కాలుని విశేషావస్థా జనిత పరిస్థితులను శాంతింప చేయగల శక్తినే త్రిపురభైరవి అని అంటారు.

ఈ త్రిపురభైరవి నృసింహ భగవానుని అభిన్నశక్తిగా చెప్పబడినది. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూల కారణము. ఇది అనుక్షణమూ జరిగే ప్రక్రియ.  ఈ త్రిపురభైరవి రాత్రి నామమే కాళరాత్రి. భైరవుని నామము కాలభైరవుడు.  ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే నా అవతారము నృసింహ సరస్వతి అవతారము. అది మహాయోగులకు త్రిపురభైరవి, కాలభైరవ అవతారము.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments