Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు అంతర్ధానము అయిన తరువాత కొంత మంది కపట బ్రాహ్మణులు సానుభూతి ప్రక టించు సందర్భం లో బాపనార్యులు చెప్పిన మాటలకు బిత్తరపోయిరి.

అప్పలరాజు శర్మ: శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగలు ఉండేవి. ఇప్పుడు మా మనస్సులు తేలికపడినవి.మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనో నేత్రము లకు శ్రీపాదుడు అగుపడుచున్నాడు.మేము కొరినదే తడవుగా శ్రీపాదుడు మాతో స్థూల దేహముతో సంభాషించుచున్నాడు. 

సాక్షాత్తూ దత్త ప్రభువునకు జననీ జనకులగుట వలన మా జన్మలు ధన్యము అయినవి. మాకు నిరతిశయ ఆనందము కలుగుచున్నది. అనిరి.అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. 

పైండా వెంకటప్పయ్య శ్రేష్టి గారు: బ్రాహ్మణోత్తములారా! ఇది వరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడుపువారము. ఇప్పుడో! మా మనోనేత్రములందు సదా మసలుటయే కాక, స్థూలదేహము తో దర్శనమిస్తూ మా ఇంటనే సంచరించుచున్నారు.

నరసింహవర్మగారు: మా కన్నులకు కప్పిన మాయతెరలు తొలగించబడినవి. నిత్యవినోది, దివ్యవినోది, అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచూ, మాతో హాస్యోక్తులనాడుచూ, మా కంటనే, జంటగా, వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటంగా మాకు స్థూలదేహముతో దర్శనమిస్తూ ఉన్నాడు.

ఇక్కడ ఇలా ఉండగా, కుక్కుటేశ్వర ఆలయములో ఉన్న సన్యాసి పరిస్థితి వేరుగా ఉండెను. ఆ విషయములు రేపు తెలుసుకుందాము.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments