Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు అంతర్ధానం అయిన తదుపరి, కుక్కుటేశ్వర ఆలయమున ఉన్న సన్యాసికి తెలుపబడెను. సన్యాసికి గుండెల్లో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తూ దత్తప్రభువునని స్పష్టంగా సూచించి అంతర్ధానం అయిరి. ఇంకొక దైవము, మరియొక దైవము పేరు కాకుండా తమ ఉపాస్యదైవము అయిన దత్తాత్రేయుల వారే తామని తెలియజేసిరి. కొంపదీసి దత్తాత్రేయుల వారు గాని శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించ లేదు కదా! వారి అవతరణము సత్యమే అయిన యెడల తనకు మున్ముందు కష్టములు కలుగుట తథ్యము. 

దత్తప్రభువులు విచిత్రస్వభావులు. వారు తనకు కష్టములను కలిగించి, వినోదము చూసి, సంపూర్ణ శరణాగతిని చెందినగాని, ఉద్దరింపరు. ఇది వారి స్వభావము.ఇంతమంది బ్రాహ్మణ్యం తనకు బ్రహ్మ రధము పట్టుటయు, ఇంట భారీ పరిణామంలో ధనరాశి పోగగుటయు, దత్తప్రభువుల కరుణ అని తలచితిని. వారి కరుణరూపములో, తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు గాని లేవు గదా! అని తలపొసెను.పేరు ప్రతిష్టల కోసము, ధనసంపత్తుల కోసము తాను అర్రులు చాచుచుండిన విషయము దత్తప్రభువులకు తెలియును. తననాశ్రయించిన బ్రాహ్మణ్యం కూడా ధనకాంక్షాపరులే!

తనకు గాని, ఈ బ్రాహ్మణ్యమునకు గాని ఆధ్యాత్మికశక్తి ఏమీయునూ లేదు. దత్తదీక్షలు అనునవి కేవలము తమకు ధనాకర్షణా విధానము మాత్రమే!ఈ దీక్షలలో పాల్గొన్నవారు, వారి కోరికలు తీరక పోయిన యెడల తమ యొక్క నిష్టాలోపమని తలంతురు. కోరికలు తీరిన యెడల దీక్షాఫలితము అని నమ్మెదరు.

శ్రీపాదుల వారు ఏదయినా చిత్రవిచిత్ర విధానమున తనను చిక్కుల లోనికి గాని త్రోసివేయరు కదా! అని ఆ సన్యాసి గడగడ లాడుచుండెను. ఇంతలో కుక్కుటేశ్వర ఆలయమునకు ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహఖాన్ అనియు, తాను కాశ్యప గోత్రీకుడననియు, మహారాష్ట్రా  దేశము నుండి ప్రత్యేకముగా కుక్కుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థం వచ్చితి ననియు,  ఇచ్చట దత్తదీక్షలనోసంగుటకు పరమహంస పరివ్రాజకాచార్యులొకరు వచ్చిఉన్నారని విని, వారి దర్శనార్థం వచ్చితిని అనియు పలికెను. 

అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొనెను. అతడు ఆ వరహాలు అన్నిటినీ దక్షిణగా సమర్పించెను. సన్యాసి పరమానంద భరితుడు అయ్యెను. సన్యాసి దీక్షనిచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు ధారపోయుటకు చేతిని జాపమని అనెను.బ్రాహ్మణుడు చేతిని జాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చెను. 

అంతట ఆ బ్రాహ్మణుని కంఠము కొంచెము కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి. నన్నే త్రాగమంటివి.ఏమీ ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకొనిన తపః ఫలమును నాకు ధారపొసితివి. నేను ఆ ధారను పీఠికాపురమునకే దత్తము చేయు చున్నాను. సన్యాసి బిత్తర పోయెను.క్షణములో ఆ వృద్ధబ్రాహ్మణుడు అదృశ్యమాయెను.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments