Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

విజయదశమి ప్రాముఖ్యత

 


విజయదశమి ప్రాముఖ్యత ఏమిటి?

విజయదశమి కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రం ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఇక విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు.

తొమ్మిది రోజుల నవరాత్రుల తరువాత వచ్చేది రోజు విజయదశమి. ఈ నవరాత్రులు, వాటి ఆఖరున వచ్చే విజయదశమికి మన సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యత శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకూండా దసరా పండగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్థ సాధకమైందని గురువాక్యం. మనిషి తనలోని కామ, క్రోధ, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

దసరాతో ముగిసే ఈ నవ రాత్రి పండుగ అందరూ జరుపుకునే ఎంతో ప్రాముఖ్యమున్న సాంప్రదాయ పండుగ. ఇది అంతా కూడా అమ్మవారికి సంబంధించిన పండుగ. ఆంధ్రలో కనకదుర్గ అని, కర్ణాటకలో చాముండీ దేవి అని, బెంగాల్లో దుర్గ అని ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ దేవతల గురించి దసరా పండుగ జరుపుతారు, కానీ ఇది ముఖ్యంగా దేవి లేదా ఆదిశక్తికి సంబంధించినది. నవరాత్రి చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి, అలాగే జీవితంలో అన్ని అంశాల పట్ల, అంటే మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, విషయాల పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండటానికి సంబంధించినది. నవ రాత్రుల తొమ్మిది రోజులు మూడు ప్రాధమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించ బడ్డాయి. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి - కోమలమైనదే కానీ ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశించబడినవి. అదే సత్వ గుణం. అది జ్ఞానం, జ్ఞానోదయానికి సంబంధించినది. 

ఈ తామస, రజస, సత్వ గుణాలలో వేటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నారనే దానిని బట్టి మీ జీవితం ఒక నిర్దేశిత మార్గంలో వెళుతుంది. మీరు తామసంగా వ్యవహరిస్తే, మీరు ఒక విధంగా శక్తివంతంగా ఉంటారు. మీరు రజసంతో వ్యవహరిస్తే మరొక విధంగా ఉంటారు. మీరు సత్వగుణంతో వ్యవహరిస్తే, మీరు పూర్తిగా వేరే తరహాలో శక్తివంతులౌతారు. మీరు వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళితే, అది ఇక శక్తికి సంబంధించినది కాదు, అది ముక్తికి సంబంధించినది. నవ రాత్రుల తరువాత పదవది, అంటే ఆఖరుది విజయదశమి- అంటే మీరు ఈ మూడు గుణాలను జయించారని అర్ధం. మీరు వాటిలో దేనికీ లొంగి పోకుండా, వాటిని దాటి వెళ్ళారు. మీరు వాటి అన్నిటిలోనూ పాల్గొన్నారు కానీ మీరు ఆ గుణాలను మీవిగా చేసుకోలేదు. మీరు వాటిని జయించారు. అదే విజయదశమి, జయం పొందిన రోజు.

మానవుడిలో స్ఫూర్తిని రగిలించి, వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్యదీక్షను తట్టిలేపి, విజయతీరానికి నడిపించడమే విజయదశమి పండుగ పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గ, కాళి, లలిత, మహిషాసురమర్దిని… ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనీషిగా, పోరాటయోధుడిగా, కర్తవ్యదీక్షాపరుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు. అదొక అనంత విజయాల దశమి.

పాలపిట్టను చూస్తే పాపాలు తొలగిపోయి సిరిసంపదలు లభిస్తాయని ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పాలపిట్ట సాధారణ రోజులు కనిపించినా కనిపించకపోయినా దసరా రోజు మాత్రం ప్రజలకు కచ్చితంగా దర్శనమిస్తుంది. అసలు పాలపిట్టను చూడటానికి కారణం ఓ కథ ఉందని పూర్వీకులు చెబుతుంటారు. పూర్వం పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాక కురుపాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసం కూడా ముగించుకుని తిరిగి వస్తుండగా వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. దీంతో వారు శుభం కలుగుతుందని నమ్మారట. అలా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన రోజే విజయదశమి పండుగ. విజయదశమి రోజున పాలపిట్ట కనిపించటంతో ఇక తమకు అన్నీ శుభాలు, విజయాలే కలుగుతాయని నమ్మారట.

ఈ క్రమంలోనే కురుక్షేత్రం యుద్ధం జరగడం.. పాండవులు విజయం సాధించటం జరిగింది. విజయదశమి రోజు పాలపిట్టను చూసినందుకు విజయం సిద్ధించిందనే కారణంతో ఆచారంగా దశమి రోజు పాలపిట్టను చూడడం సంప్రదాయంగా మారిందని చెబుతుంటారు. అలా విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగడం గమనార్హం. కాగా పాలపిట్ట నీలం రంగులో ఉండి అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా కూడా గౌరవం ఇచ్చారు. కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు కూడా పాలపిట్ట రాష్ట్ర పక్షిగా ఉండటం విశేషం. ఒక ప్రస్తుతం పక్షులు కరువయ్యాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా పల్లెల్లో కూడా పక్షులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.

ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చనా విధానమే నవరాత్రి వ్రతం. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతమవుతుంది. ఇలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది, ఆధ్యాత్మికశక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తిమంతుడవుతాడు.

Post a Comment

0 Comments