జుట్టు రాలకుండా చూసుకోండి
ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టత లను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపర మైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్టోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబు తోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవ డమే. కానీ ఆ మూలకాల లోపం వంశపారంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదు లుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది.
బయోటిన్ బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు చాలా ముఖ్యమైనది.
సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు.కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించ లేని నొప్పి ఉంటుంది.
కొల్లాజెన్: కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ఎక్కు వగా ఊడిపోతుంది.
విటమిన్ బి6 జుట్టుకి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్య లను కలిగిస్తుంది. విటమిన్ బి6 మన జుట్టు ఆరో గ్యానికి సంబంధిం చినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది.
జింక్ జింక్ లోపం ప్రధాన లక్షణం జుట్టు వేగంగా రాలడం. మీ జుట్టు అకస్మాత్తుగారాలడం ప్రారంభించిందని మీకు అని పిస్తే అది జింక్ లోపం వల్ల కావచ్చుననిభావించి జింక్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.ఎక్కువగా ఊడిపోయి బట్ట తల వస్తుంది.
అందువల్ల ఒకసారి మంచి ట్రైకా లజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడిపోతోందో తెలుసుకుని ఆ విటమిన్ లోపాన్ని పూరించడం ద్వారాజుట్టు రాలకుండా నివారించవచ్చు
0 Comments