Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శంకరభట్టు, ధర్మగుప్తుల వారు, బ్రాహ్మణునికి హామీ ఇచ్చి, జూదగాళ్ల మధ్యలో ఇరుక్కొనిరి. 

శరభేశ్వరశాస్త్రికి ఒక చెల్లెలు ఉండెను. ఆమె కూడా అదే గ్రామమున నివసించుచుండెను.  ఆమెకు ఉషఃకాలమున ఒక స్వప్నము కలిగెను. ఆమెకు మిక్కుటంగా జ్వరము వచ్చినట్లు, ఆమె యొక్క భర్త మరణించినట్లు, ఆమెకు వైధవ్యం కలిగినట్లు, ఆ స్వప్నము యొక్క సారాంశము. 

ఆమె తన అన్నగారైన శరభేశ్వరశాస్త్రిని స్వప్న ఫలితమును గూర్చి ప్రశ్నించెను. శరభేశ్వరుడు తను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడిగెను. అంతట, ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశాంత రమున ఉన్నాడని, మార్గమధ్యమున దొంగలు ఇతనిపై పడి ధనమును దోచుకొని,  అతనిని చంపి వేసినారని చెప్పెను.

ఆమె కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. ఇంతలో పందెగాళ్లు ఆమె ఇంటికి చేరి, మన గ్రామములో శంకరభట్టు అనెడి మహానుభావుడు అరుదెంచెనని, అతడు ఘటనాఘటన సమర్థుడు అనియు, శ్రీపాద శ్రీవల్లభులనెడి గొప్ప దైవమును అతడు ఆరాధించునని, అతని వలన సత్య వివరణను పొందవచ్చు అని తెలియజేసిరి.

ఆమె ఇంతకు పూర్వము ఎన్నడునూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గూర్చి విని ఉండలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గూర్చి విని, ఆ మహాను భావునికి తన బాధను వివరించి, ఆశీర్వాదములు పొందగోరెను. ఆమెను శంకరభట్టు ఉన్న ఇంటికి తీసుకొనివచ్చిరి. అన్నా! నా మాంగల్యమును కాపాడుము అని ఆమె దీనముగా ప్రార్ధించినది. 

శంకరభట్టు హృదయము ఎంతగానో చలించిపోయినది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయ మున పంచదేవపహాడ్ నందలి పంటకాపు పొందిన మంత్రాక్షతలు శంకరభట్టు వద్ద కొన్ని ఉండెను.  ఏదో దివ్య స్ఫురణ కలిగినది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి యీయబడిన మంత్రా క్షతలు కనుక, ఈమె మాంగల్యమును కాపాడునని స్ఫురించెను. 

అమ్మా! ఈ మంత్రాక్షతలను నీవు తీసుకొనుము. ఇవి పసిడి అక్షతలు. వీటిని నీ పూజాగృహమున భద్రపరచుకొనుము. నీ భర్త కొలది రోజులలోనే నిన్ను చేరును. ఇది సత్యము అని పలికెను.

శరభేశ్వరశాస్త్రికి పందెములను కాయు పంటకాపులు ఈ వర్తమానమును అందించిరి. అతడు అగ్గి మీద గుగ్గిలమాయెను. నిజము గానే నా చెల్లెలి భర్త సజీవస్థితిలో ఇంటికి వచ్చిన యెడల ఆ బీదబ్రాహ్మణుని బాకీ తీర్చివేయుటయే కాక, శంకరభట్టును గురువుగా స్వీకరించి, నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించెదను. అని పలికెను. 

మూడురోజులు గడచినవి. ఆ మూడురోజులలో కొంతమంది పంటకాపులు శంకరభట్టు ఉంటున్న బీదబ్రాహ్మణుని ఇంటి ఆహారసామగ్రి తెచ్చుచుండిరి. వారు పందెము శంకరభట్టు మీద కాసినవారు. శంకరభట్టు విజయుడైనచో వారు కూడా విజయమును పొందెదరు. వారికి పందెములో విశేషధనము లభించును.

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

Post a Comment

0 Comments