శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపీఠికాపురంలో ఉన్న వేదపండితుల గోష్టి ప్రారంభమయ్యెను.
ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమాయెను. ఆదిశంకరులు కాశీలోని మండనమిశ్రునితో వాదించిరి. వాదమున తనను కూడా గెలిచిన కానీ పరీక్ష పూర్తి కాదని, ఉభయభారతీదేవి పలికెను.
కామశాస్త్ర విషయముపై ఉభయభారతీదేవి ప్రశ్నించెను. ఆ శాస్త్రము నందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము. అందువలన ఆరుమాసముల వ్యవధి కోరెను. ధర్మ విరుద్ధము కాకుండా శాస్త్రజ్ఞానమును పొందవలెనని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజొకడు చనిపోయెను. శంకరులు తమ పరకాయప్రవేశ విద్య వలన మహారాజు శరీరము నందు ప్రవేశించిరి.
తమ భౌతికశరీరమును జాగర్తగా కాపాడవలెనని, అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతికభాషలో తెలియజేయవలెనని శిష్యులను ఆదేశించారు. మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరము లోనికి ప్రవేశించెనని,
తన భర్త యొక్క ప్రాణమయ జగత్తు లోని చైతన్యమును ఈ మరణించిన శరీరము లోనికి ఆకర్షించి, తన భర్త దాంపత్యసుఖమును అనుభవించుచుండగా సాక్షీమాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్తశరీరములో అధ్యక్షస్థానంలో ఉండి, ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననీ తాను తెలుసుకొనెను.
ఆ దివ్యాత్మ తన భర్త శరీరములో ఉండునంత వరకు మాత్రమే, తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరములో ఉండునని ఆమెకు తెలిసెను. అందువలన నగరములో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవయినా ఉన్నఎడల వాటిని దగ్దము చేయవలెనని ఆదేశించెను.
శంకరుల శరీరమును ధగ్ధము చేయుచుండగా శిష్యులు రాజువేషమున ఉన్న శంకరులకు సాంకేతికభాషలో విషయమును తెలియజేసిరి. మంటలలో కాలిపోయిన కాలుసేతులను శ్రీలక్ష్మినరసింహుని కృపాకటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి.
అంతట శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధముగా ప్రశ్నించిరి. ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరములో ఉండి, ఆ శరీరమును విడిచిన తదుపరి మరియొక శరీరము లోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పునది. అయిన యెడల నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను.
ఆత్మ ఒకే సమయమున మూడు నాలుగు శరీరములలో ఉండి, మూడు నాలుగు జన్మల కర్మఫలములను రహితము చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము! ఇదివరకు ఎన్నడూ ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు వారు అనిరి.
శ్రీపాదుల వారు: గతములో లేకేమి! ఉన్నవను విషయము మీకు తెలియదు. స్వామి వారి వివరణ రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments