COVID-19 UPDATES
దేశ సంపద- కార్పొరేట్ అధిపతుల పన్ను రాయితీలు, ఎగ్గొట్టిన బ్యాంకు అప్పు రద్దు కోసం._*
కరోనా మహమ్మారీ నివారణ కోసం మాత్రం ప్రజల సొమ్ము.
👉 కేంద్ర ప్రభుత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సెపెండీచర్) జారీ చేసిన లె.నె.1/1/2020E.II(B) DTD.23-04-2020 ఉత్తర్వుల్లో సంవత్సరంన్నర పాటు(జనవరి-2020-జూన్-2021) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల కరువుభత్యాన్ని (D.A) నిలిపివేస్తున్నట్లు, తిరిగి సంవత్సరంన్నర తరువాత, యధాప్రకారం జూల్-2021 నుండి పునరిద్దరిస్తామని తెలిపారు అయితే-కరువుభత్యం బకాయిలు చెల్లించేదిలేదని కూడా తెలిపారు.
👉 కరోనా వైరస్ మహమ్మారి నివారణచర్యల పేరుతో, సంక్షోభం నుంచి బైటపడడానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల కరువుభత్యాన్ని ఆపివేస్తున్నట్లు, ఈ మొత్తాన్ని పేదప్రజల కోసం వినియోగిస్తామని తెలిపింది.
👉 పేదలకు సహాయం పేరుతో, ఉద్యోగుల పెన్షనర్ల కరువు భత్యాన్ని లాక్కోవడం ఏమిటనేది ప్రశ్న.?
👉 ఏప్రిల్-2019లో 1లక్షా60వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ నిధులను మళ్ళించింది.ఆ తరువాత నెలలో బడాకంపెనీలకు 1లక్ష45వేల కోట్ల కార్పొరేట్ టాక్స్ ను రద్దు చేసింది.ఇదొక్క సంఘటనే కాదు, మోడీ ప్రభుత్వం ఏప్రిల్-2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత, కార్పొరేట్ కంపెనీలకు, బడా పెట్టుబడిదారుల కోసం సుమారు రూ.5లక్షల55వేలకోట్ల రూపాయల బ్యాంకు లోన్స్ ని, మొండి పద్దులు పేరుతో రద్దు చేసింది.
అంటే-బడా కంపెనీలు/కార్పొరేట్ అధిపతులకు సహాయం చేయడానికి ఈ దేశం సంపదను దోచిపెడుతున్న ప్రభుత్వం, పేదలకు సహాయం పేరుతో ఉద్యోగుల పెన్షనర్ల జేబులను గుల్ల చేస్తుందన్న మాట. మన పరిపాలకులు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
✍️ @పరిపూర్ణ
0 Comments